Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న అనంత.. నేడు జార్ఖండ్.. లాఠీకి పనిచెప్పిన పోలీసులు

నిన్న.. అనంతపురం గుత్తి రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ సిబ్బంది ఓ ప్రయాణీకుడిపై చేజేసుకున్నాడు. సురేష్ అనే యువకుడు జనరల్ టికెట్ తీసుకుని బెంగళూరు నుంచి కాచిగూడ వెళ్లే రైలు కదులుతున్నప్పుడు స్లీపర్ కోచ్ ఎక్

Webdunia
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (13:40 IST)
నిన్న.. అనంతపురం గుత్తి రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ సిబ్బంది ఓ ప్రయాణీకుడిపై చేజేసుకున్నాడు. సురేష్ అనే యువకుడు జనరల్ టికెట్ తీసుకుని బెంగళూరు నుంచి కాచిగూడ వెళ్లే రైలు కదులుతున్నప్పుడు స్లీపర్ కోచ్ ఎక్కాడు. దీంతో ఆర్పీఎఫ్ సిబ్బంది సురేష్‌ను రైలు నుంచి దించారు.

రైలు కదలడంతోనే స్లీపర్ కోచ్ హడావుడిలో ఎక్కానని చెప్పినా సిబ్బంది వినిపించుకోకుండా ఓవరాక్షన్ చేసింది. లాఠీతో సురేష్‌ను చితకబాదాడు. ఫ్లాట్ ఫామ్‌లోనే కాకుండా.. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
మరోవైపు జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ సమీపంలోని జూబ్లీపార్క్ వద్ద నడిరోడ్డుపై మతిస్థిమితం లేని వ్యక్తిని పోలీసులు కర్రలతో కొట్టారు. మతిస్థిమితంలేని వ్యక్తిపై పోలీసులు చేజేసుకోవడానికి సంబంధించిన దృశ్యాలను స్థానికులు స్మార్ట్ ఫోన్ల ద్వారా రికార్డు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మీడియా ఆ పోలీసులను ప్రశ్నించగా... రోడ్డుపై నుంచి పక్కకు పంపడానికి తాము అతడిని భయపెట్టాలని మాత్రమే చూశామని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments