Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌగిలించుకునేందుకు కాంగ్రెస్ నేతలను ఆహ్వానించలేదు : పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఏర్పాటు చేసిన సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ(జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ) తొలి సమావేశం హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్‌లో శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ సమావేశం పవన్ అధ్యక్షతన

Webdunia
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (12:50 IST)
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఏర్పాటు చేసిన సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ(జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ) తొలి సమావేశం హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్‌లో శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ సమావేశం పవన్ అధ్యక్షతన రెండు రోజుల పాటు జరుగనుంది. ఇందులో కేంద్ర ప్రబుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, రాష్ట్రం ఖర్చు చేసిన నిధులు, విభజన హామీలు తదితర అంశాలపై జేఎఫ్‌సీలోని నేతలు, మేధావులు, న్యాయనిపుణులతో చర్చిస్తారు. అయితే, సమావేశానికి కాంగ్రెస్ నేతలను ఆహ్వానించడం ఇపుడు వివాదాస్పదంగా మారింది. దీనిపై పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. 
 
జేఎఫ్‌సీ సమావేశానికి కాంగ్రెస్ నేతల అభిప్రాయం తెలుసుకునేందుకే పిలిచామే తప్ప వారిని కౌగిలించుకోవడం లేదన్నారు. అలాగే సమావేశానికి టీడీపీ, వైసీపీ వారిని కూడా పిలిచామని, కానీ వారు మాత్రం వారి పంథాలో ముందుకు వెళుతున్నారని చెప్పారు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. రెండు రోజుల సమావేశం అనంతరం తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments