Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగవారి మధ్య మేటి నేతగా ఇందిరా గాంధీ సత్తా చాటారు : నితిన్ గడ్కరీ

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (09:41 IST)
మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీ ప్రశంసల వర్షం కురిపించారు. ఎలాంటి రిజర్వేషన్లు లేకుండానే మగవారి మధ్య మేటి నేతగా ఆమె ఉన్నతస్థాయికి ఎదిగారని ఆయన గుర్తుచేశారు. పైగా, తన వ్యక్తిగత ప్రతిభతో ఆమె రాణించారని కొనియాడారు. 
 
నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మహిళా రిజర్వేషన్లు అనే అంశంపై ఆయన మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ల హోదా పొందకుండానే మగవారి మధ్య మేటి నేతగా నాడు ఇందిరా గాంధీ తన సత్తా చాటుకున్నారని ప్రశంసలు కురిపించారు. ఎంటువంటి రిజర్వేషన్ సౌకర్యం పొందకుండానే ఆమె తన పాలన సాగించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 
 
అలాగే, ఆయన తన సొంత పార్టీలోని మహిళా నేతలైన సుష్మా స్వరాజ్, వసుంధరా రాజే, సుమిత్రా మహాజన్, స్మృతి ఇరానీ వంటి, నిర్మాలా సీతారామన్ వంటివారు కూడా ఎటువంటి రిజర్వేషన్ సౌకర్యం లేకుండానే రాజకీయాల్లో దూసుకెళుతున్నారని కొనియాడారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments