Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మేడే, మేడే" కాల్, ఈసారి ఇండిగో విమానం వంతు, ఏం జరిగిందో తెలుసా?

ఠాగూర్
శనివారం, 21 జూన్ 2025 (18:56 IST)
ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ నగరంలో ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 275 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని ఉలికిపాటికి గురిచేసింది. తాజాగా మరో విమానం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది. మేడే కాల్‌ ఈ విమానాన్ని రక్షించింది. గౌహతి నుంచి చెన్నైకి వెళుతున్న ఇండిగో విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు సంబంధిత వర్గాల సమాచారం...
 
గౌహతి నుంచి చెన్నైకు ప్రయాణికులతో బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అందులో ఇంధనం తక్కువగా ఉండటాన్ని పైలెట్లు గుర్తించారు. వెంటనే పైలెట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ (ఏటీసీ)కి మేడే కాల్ సందేశం పంపించారు. తక్షణమే బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. దీంతో విమానానికి ప్రమాదం తప్పింది. ఈ ఘటన మూడు రోజుల క్రితం చోటుచేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. 
 
మేడే కాల్ అనేది డిస్ట్రెస్ కాల్. అత్యవసర ప్రమాద పరిస్థితిని ఎదుర్కొంటున్నామనే విషయాన్ని రేడియో కమ్యూనికేషన్ ద్వారా సమీపంలోని ఏటీసీకి తెలియజేయడం కోసం దీన్ని ఉపయోగిస్తారు. తాము ఆపదలో ఉన్నామని, తక్షణం సాయం అవసరమని విజ్ఞప్తి చేసేందుకు ఉపయోగిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments