ప్రపంచంలోనే మూడో అత్యంత శక్తిమంతైన వైమానిక శక్తిగా భారత్

ఠాగూర్
శుక్రవారం, 17 అక్టోబరు 2025 (12:49 IST)
ప్రపంచ వైమానిక దళాల శక్తిసామర్థ్యాల్లో భారత వాయుసేన సత్తా చాటింది. ఇప్పటివరకు ఆసియాలో అగ్రగామిగా ఉన్న చైనాను వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే మూడో అత్యంత శక్తిమంతమైన వైమానిక శక్తిగా అవతరించింది. 'వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడ్రన్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్' (డబ్ల్యూడీఎంఎంఏ) తాజాగా విడుదల చేసిన ర్యాంకుల్లో ఈ విషయం స్పష్టమైంది. 
 
ప్రపంచవ్యాప్తంగా 103 దేశాలకు చెందిన 120 రకాల వైమానిక సేవలను విశ్లేషించి డబ్ల్యూడీఎంఎంఏ ఈ ర్యాంకులను ప్రకటించింది. ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా 242.9 ట్రూ వాల్యూ రేటింగ్ (టీవీఆర్) పాయింట్లతో మొదటి స్థానంలో తిరుగులేని శక్తిగా నిలిచింది. 
 
ఆ తర్వాత 114.2 టీవీఆర్ స్కోర్ రష్యా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక, 69.4 టీవీఆర్ పాయింట్లతో భారత వాయుసేన మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటివరకు మూడో స్థానంలో ఉన్న చైనా 63.8 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ జాబితాలో జపాన్ (58.1), ఇజ్రాయేల్ (56.3), ఫ్రాన్స్ (55.3) వరుసగా ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో నిలిచాయి.
 
మరోవైపు, పాకిస్థాన్ వైమానిక దళం 46.3 రేటింగ్‌తో 18వ స్థానానికి పరిమితమైంది. ఈ తాజా ర్యాంకులు భారత వైమానిక దళం ఆధునికీకరణ, పెరుగుతున్న సామర్థ్యాలకు అద్దం పడుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments