Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంద్రాగస్టు వేడుకలు : ఎర్రకోటపై 8వ సారి జెండా ఎగురవేసిన ప్రధాని మోడీ

Webdunia
ఆదివారం, 15 ఆగస్టు 2021 (09:34 IST)
భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 8వ సారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశ ప్రజలకు స్వాత్రంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 
 
అంతకు ముందు ఆయన రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అజయ్‌భట్‌ స్వాగతం పలికారు. 
 
ఆ తర్వాత త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించి.. ఎర్రకోటపై జాతీయ జెండా ఎగుర వేసి, గౌరవ వందనం సమర్పించారు. ఒలింపిక్స్​లో పాల్గొన్న భారత క్రీడాకారులు స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 
 
కేంద్ర మంత్రులు, ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించినవారు దేశానికే స్ఫూర్తి అంటూ అభినందించారు. ఇండియా బోర్డర్‌లో విధులు నిర్వహిస్తున్న జవాన్లకు వందనం చేశారు. అనంతరం స్వాతంత్ర్య పోరాట యోధులను స్మరించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments