Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూన్ లైటింగ్ ఉద్యోగులకు చిక్కులు - ఐటీ శాఖ నోటీసులు

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2023 (16:01 IST)
కరోనా సమయంలో మూన్‌లైటింగ్‌ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ముఖ్యంగా ఐటీ రంగంలో ఈ పదం ఎక్కువగా వినిపించింది. ఒక కంపెనీలో పూర్తి స్థాయిలో ఉద్యోగిగా పనిచేస్తూనే అదనపు ఆదాయం కోసం మరో సంస్థలో పనిచేసి కొందరు జీతం తీసుకున్నారు. మరి కొందరు నెలవారీ, ఇంకొందరు మూడు నెలలకోసారి చొప్పున ఆదాయం పొందారు. ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దీన్ని సమర్థించగా.. మరికొందరు మాత్రమే తీవ్రంగా వ్యతిరేకించారు. మూన్‌లైటింగ్‌కు పాల్పడిన వారిని కొన్ని సంస్థలు ఉద్యోగం నుంచి తొలగించాయి. ఇపుడు మరోమారు ఈ అంశం చర్చకు వచ్చింది. 
 
మూన్‌లైటింగ్‌ ద్వారా ఆదాయం పొందిన ఉద్యోగుల్లో కొందరు.. తమ ఆదాయాన్ని ఐటీ రిటర్నుల్లో చూపించకపోవడమే ఇందుక్కారణం. దీంతో ఆయా ఉద్యోగులకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతానికి 2019-2020, 2020-2021 ఆర్థిక సంవత్సరాల ఆదాయాలకు సంబంధించి ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేసినట్లు ఆంగ్ల పత్రిక 'ఎకనమిక్‌ టైమ్స్‌' పేర్కొంది.
 
ఈ నేపథ్యంలో కొందరు ఉద్యోగులు కేవలం ప్రధాన కంపెనీ ఆదాయాన్ని మాత్రమే రిటర్నుల్లో చూపించినట్లు ఐటీశాఖ గుర్తించింది. దీంతో ఆయా ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. తొలుత రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు వార్షికాదాయాన్ని రిటర్నుల్లో చూపించని వారికి ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. 
 
ఈ సంఖ్య దాదాపు వెయ్యికిపైనే ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తమ ఉద్యోగులు మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్నారంటూ కొన్ని కంపెనీలే స్వయంగా ఐటీ శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మున్ముందు మరింత మందికి నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్డ్జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం

ప్రముఖ సినీ గేయరచయిత కులశేఖర్ ఇకలేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments