Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీకి నితీశ్ షాక్... పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు కడగండ్ల పాలయ్యారు

ప్రధాని నరేంద్ర మోడీకి బీహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ తేరుకోలేని షాకిచ్చారు. ప్రతిపక్షాలన్నీ ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సమయంలో, నితీశ్ కుమార్ దానిని సమర్థించ

Webdunia
సోమవారం, 28 మే 2018 (10:59 IST)
ప్రధాని నరేంద్ర మోడీకి బీహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ తేరుకోలేని షాకిచ్చారు. ప్రతిపక్షాలన్నీ ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సమయంలో, నితీశ్ కుమార్ దానిని సమర్థించి సంచలనం సృష్టించారు. ఇపుడు వెనక్కి తగ్గారు.  పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు కడగండ్ల పాలయ్యారంటూ మండిపడ్డారు.
 
శనివారం జరిగిన బ్యాంకర్ల సమావేశంలో తొలిసారిగా ఆయన పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడారు. 'పెద్ద నోట్ల రద్దుకు సైద్ధాంతికంగా మద్దతు ఇచ్చినా.. అది అమలు జరిగిన తీరు పేలవంగా ఉందని చెప్పడానికి వెనకాడడం లేదు. సామాన్యులు కడగండ్ల పాలయ్యారు. చాలామంది కేవలం లోటుపాట్లనే చూస్తున్నారు' అని వ్యాఖ్యానించారు.
 
నిజానికి బీహార్ రాష్ట్రంలో బీజేపీతో కలిసి నితీశ్ కుమార్ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. పైగా, పెద్ద నోట్ల రద్దుకు గట్టి మద్దతుదారు, ప్రధాని మోడీకి అత్యంత ఆప్తుడిగా ఉన్న నితీశ్ కుమార్‌ ఇపుడు యూ తీసుకోవడం గమనార్హం. అదీ కూడా బీహార్‌ బీజేపీ సీనియర్‌ నేత, ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోడీ సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పైగా కేంద్రంలో మోడీ నాలుగేళ్ల పాలనను పూర్తి చేసుకున్న శనివారమే ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments