Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడలితో ఆ సంబంధం.. కొడుకును ఏం చేశాడంటే?

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (15:37 IST)
వివాహేతర సంబంధాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తాజాగా కోడలితో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్నకొడుకని కూడా చూడకుండా దారుణంగా హత్య చేసాడు ఓ కసాయి తండ్రి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. 
 
పంజాబ్ రాష్ట్రంలోని ఫరీదాకోట్ ఏరియాకు చెందిన 60 ఏళ్ల చోటా సింగ్ అనే వ్యక్తికి ముగ్గురు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు రాజ్వీందర్ సింగ్‌కు 12 ఏళ్ల క్రితం పెళ్లైంది. రాజ్వీందర్ సింగ్ భార్య జస్వీర్ కౌర్‌తో పాటు ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు.

ఇదిలా ఉండగా అతడు తండ్రిని కొన్నాళ్లు తన దగ్గర ఉంచుకునేందుకు ఇంటికి తీసుకొచ్చాడు. అయితే కొడుకు ఆఫీసుకు వెళ్లిన సమయంలో కోడలు జస్వీర్‌కౌర్‌తో ఇంట్లో ఒంటరిగా ఉండే చోటా సింగ్ ఆమెను లొంగదీసుకున్నాడు.
 
రాజ్వీందర్ సింగ్‌కు తెలియకుండా ఇద్దరూ శారీరక సంబంధం కొనసాగిస్తూ వచ్చారు. కొన్నాళ్లకు మామా-కోడళ్ల మధ్య కొనసాగుతున్న ఆ సంబంధాన్ని రాజ్వీందర్ సింగ్ ఎలాగోలా కనిపెట్టాడు. తండ్రిని చిన్నకొడుకు దగ్గర విడిచిపెట్టాలని భావించాడు. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న కొడుకును చంపేయాలని చోటా సింగ్ ఫిక్స్ అయ్యాడు. 
 
రాత్రి పడుకున్న తర్వాత రాజ్వీందర్ సింగ్‌పై కత్తితో దాడి చేసిన చోటా సింగ్ శవాన్ని ముక్కలు చేసి బ్యాగులో పెట్టి డ్రైనేజీలో పడేశాడు. చోటా సింగ్, జస్వీర్ కలిసి బాడీని తీసుకుని డ్రైనేజీలో పడేయడానికి వెళ్లిన సమయంలో వారి ఇంటికి మేనల్లుడు వచ్చాడు
 
గదిలో ఉన్న రక్తం చూసి, కంగారుపడి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోటాసింగ్‌ను తమదైన శైలిలో నిలదీయగా విషయం బయటికి వచ్చింది. మామకోడళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్.ఆర్.ఆర్. బిహైండ్, బియాండ్ వీడియోను విడుదలచేస్తున్న ఎస్.ఎస్.రాజమౌళి

కె.సి.ఆర్. (కేశవ చంద్ర రమావత్) కు పార్ట్ 2 కూడా వుంది : రాకింగ్ రాకేష్

అల్లు అర్జున్ బెయిల్ రద్దుకు పోలీసుల అప్పీల్?

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అంటున్న డకాయిట్ టీమ్

వైలెంట్ - సైలెంట్ ప్రేమకథ - ఫ్లాప్ వచ్చిన ప్రతిసారీ మారాలనుకుంటా : అల్లరి నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

తర్వాతి కథనం
Show comments