Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాంబే ఐఐటీకి రూ.160 కోట్ల విరాళం ఇచ్చిన పూర్వ విద్యార్థి

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2023 (17:10 IST)
దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఒకటిగా పేరుగడించిన బాంబే ఐఐటీకి  పూర్వవిద్యార్థి ఒకరు భారీ విరాళాన్ని ఇచ్చారు. ఈ విద్యార్థి రూ.160 కోట్లకు చెక్ రాసి పంపించాడని ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ సుభాసిస్ చౌదరి వెల్లడించారు. అయితే, తన పేరు వెల్లడించవద్దని దాత కోరడంతో వివరాలను గోప్యంగా ఉంచాల్సి వస్తోందన్నారు.
 
ఈ మొత్తాన్ని గ్రీన్ ఎనర్జీ అండ్ సస్టైనబిలిటీ రీసెర్చ్ హబ్ ఏర్పాటుకు వెచ్చిస్తామన్నారు. ఐఐటీ బాంబేకు ఇచ్చే విరాళం సరైన పనికి ఉపయోగపడుతుందని సంస్థ పూర్వ విద్యార్థులతో పాటు అందరికీ తెలుసని డైరెక్టర్ చెప్పారు. 
 
కాగా, ఇంత పెద్ద మొత్తంలో విరాళం అందించి కూడా ప్రచారం కోరుకోకపోవడం దాతకున్న గొప్ప మనసును చాటుతోందని ప్రశంసించారు. బహుశా యూనివర్సిటీ అందుకున్న డొనేషన్లలో ప్రచారం కోరుకోని వ్యక్తి ఈ దాత మాత్రమే కావొచ్చని చెప్పారు.
 
ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని కూడా ఇటీవల ఐఐటీ బాంబేకు రూ.315 కోట్ల విరాళం అందించారు. నందన్ నీలేకని 1973లో ఇక్కడి నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పట్టా పొందారు. ఐఐటీ బాంబేలో చేరి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ విరాళాన్ని అందించారు. 
 
ఐఐటీ బాంబే ఇప్పటివరకు అందుకున్న విరాళాల్లో ఇదే భారీ మొత్తం కావడం విశేషం. గతంలోనూ నీలేకని రూ.85 కోట్లు విరాళంగా ఇచ్చారు. దీంతో ఐఐటీ బాంబేకు నీలేకని ఇచ్చిన మొత్తం విరాళం రూ.400 కోట్లు అని డైరెక్టర్ ప్రొఫెసర్ సుభాసిస్ చౌదరి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిక లేకుండా వుండలేను.. కార్తీ నువ్వు కార్తీ కాదు.. కత్తివిరా!: సూర్య (video)

తెలుగోళ్లు అన్నం పెడుతున్నారు.. తప్పుగా మాట్లాడలేదు : నటి కస్తూరి

పిల్లల సమక్షంలో రెండో పెళ్లి చేసుకున్న సన్నీ లియోన్.. వరుడు ఎవరంటే? (photos)

6 నుంచి "పుష్ప" కోసం శ్రీలీల - అల్లు అర్జున్ ఐటమ్ సాంగ్ చిత్రీకరణ?

అమెరికాలో మృతి చెందిన మిథున్ చక్రవర్తి తొలి భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments