Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఏఎస్ టాపర్లు విడాకులు తీసుకున్నారు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (12:12 IST)
వారిద్దరూ దేశంలో అత్యున్నత విద్యాభ్యాసమైన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)లో టాపర్లుగా నిలిచారు. వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ, కలిసి కాపురం చేయలేకపోయారు. దీంతో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. వీరిద్దరూ కలిసి కేవలం నాగేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వార్తను పరిశీలిస్తే, ఆ ఐఏఎస్ టాపర్లు టీనా దాబి.. అత‌ర్ అమిర్ ఖాన్‌. 2015 బ్యాచ్ టాప‌ర్స్‌. 2018లో పెళ్లి చేసుకున్నారు. ఆ జంట ఇప్పుడు విడాకులు తీసుకుంది. ఇష్ట‌పూర్వ‌కంగానే ఇద్ద‌రూ గ‌త న‌వంబ‌ర్‌లో డైవ‌ర్స్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఆ జంట బ్రేక‌ప్‌కు జైపూర్‌లోని ఫ్యామిలీ కోర్టు ఓకే చెప్పిన‌ట్లు కూడా తెలుస్తోంది.
  
2015లో టీనా దాబి యూపీఎస్సీ ప‌రీక్ష‌లో టాప్ ర్యాంక్ కొట్టింది. ఆ ఏడాదే కాశ్మీర్‌కు చెందిన అత‌ర్ అమిర్ ఖాన్ రెండో ర్యాంక్ సాధించారు. శిక్ష‌ణ స‌మ‌యంలో ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డారు. రాజ‌స్థాన్ కేడ‌ర్‌కు చెందిన ఇద్ద‌రూ జైపూర్‌లో విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. అయితే ఇటీవ‌ల డిప్యూటేష‌న్‌పై అత‌ర్ ఖాన్‌ను కాశ్మీర్‌కు పంపారు.
 
ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో చ‌దువుకున్న టీనా దాబి ఓ ద‌ళిత విద్యార్థిని. యూపీఎస్సీ ప‌రీక్ష‌లో టాప్ ర్యాంక్ సాధించ‌డంతో అప్ప‌ట్లో ఆమె పెను సంచ‌ల‌నం క్రియేట్ చేసింది. అనంత్‌నాగ్‌కు చెందిన అత‌ర్ ఖాన్‌ను 2018 ఏప్రిల్‌లో ఆమె పెళ్లి చేసుకున్న‌ది. 
 
ఆ వెడ్డింగ్ రిష‌ప్ష‌న్‌కు ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడితో పాటు ప‌లువురు కేంద్ర మంత్రులు, అప్ప‌టి స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ హాజ‌ర‌య్యారు. దీంతో ఆ వివాహం అంద‌ర్నీ ఆక‌ర్షించింది.
 
మ‌తాంత‌ర వివాహం చేసుకోవ‌డంతో అప్ప‌ట్లో ఆ వార్త మీడియాలో గుప్పుమ‌న్న‌ది. మ‌త ఆచారాల‌కు అతీతంగా త‌మ పెళ్లి జ‌రిగిన‌ట్లు కూడా ఆ జంట ఒప్పుకున్న‌ది. కానీ ఇప్పుడు ఆ ఇద్ద‌రూ విడాకుల తీసుకున్న‌ట్లు తీసుకున్నట్టు వస్తున్న వార్తలు కూడా సంచలనంగా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments