Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్తగా ఓటర్ల నమోదుకు అవకాశం

కొత్తగా ఓటర్ల నమోదుకు అవకాశం
, బుధవారం, 11 ఆగస్టు 2021 (10:58 IST)
కొత్తగా ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రకటించింది.
♦ 2022 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండుతున్న వారు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ సవరణ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
♦ గతంలో ఓటర్లుగా నమోదు చేసుకోని వారికీ అవకాశం కల్పించనున్నారు. 
♦ఈ మేరకు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) కె.విజయానంద్‌ ప్రకటన విడుదల చేశారు.
♦అక్టోబరు 31వ తేదీ వరకూ ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితాను పరిశీలించాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు.
♦ 2021 నవంబర్‌ 1వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. 
♦నవంబరు 30వ తేదీ వరకూ అభ్యంతరాలను స్వీకరించనున్నట్టు ఎన్నికల ప్రధానాధికారి ఉత్తర్వుల్లో తెలిపారు.
♦నవంబర్‌ 20, 21 తేదీల్లో ఓటరు నమోదుపై విస్తృతంగా ప్రచార కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. 
♦డిసెంబర్‌ 20 నాటికి అభ్యంతరాల పరిశీలన పూర్తిచేసి జనవరి 5న తుది జాబితా విడుదల చేస్తామని సీఈవో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్యుత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా హైదరాబాద్ విమానాశ్రయం