Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూలిన భారత మిగ్‌ విమానం.. ఇద్దరు పైలట్ల మృతి.. పాక్ వాయుసేనకు చెక్

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (11:57 IST)
భారత వాయుసేన పాకిస్థాన్ భూభాగంలో దాడులు చేసిన నేపథ్యంలో భారత సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారత సరిహద్దుల్లో భారత సైన్యాన్ని టార్గెట్ చేసి.. పాకిస్థాన్ సైన్యం కాల్పులు జరుపుతోంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో ఒక యుద్ధవిమానం కూలిపోయింది.


భారత వాయుసేనకు చెందిన మిగ్‌ విమానం ఇదని సైనికాధికారులు చెప్తున్నారు. బుద్గాం జిల్లాలో గరెండ్‌ కలాన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. సాంకేతిక కారణాలతోనే విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. 
 
యుద్ధవిమానానికి చెందినదిగా భావిస్తున్న వీడియోను పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. ఈ ఘటనను అధికారులు ధ్రువీకరించారు. ఇకపోతే.. పాక్‌ యుద్ధవిమానాలు నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి వచ్చి బాంబులు జార విడిచి వెళ్లాయి. బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
పాక్‌ యుద్ధవిమానాల కదలికలపై ముందు నుంచే ఒక కన్నేసిన భారత వాయుసేన వెంటనే ప్రతిస్పందించింది. భారత్‌కు చెందిన యుద్ధవిమానాలు వాటిని అడ్డుకొనేందుకు వెళ్లాయి. భారత వాయుసేన విమానాల ప్రతిఘటనతో పాక్‌ విమానాలు తోకముడిచాయి. పూంచ్‌, రాజౌరీ సెక్టార్లలో ఈ ఘటనలు చోటు చేసుకొన్నాయి. భారత్‌ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన విమానాలు పాక్‌ ఎఫ్‌-16 విమానాలుగా భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments