Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్‌కు ఆ అవకాశమే ఇవ్వని.. భారత వాయు సేన.. ఏంటది?

Advertiesment
పాకిస్థాన్‌కు ఆ అవకాశమే ఇవ్వని.. భారత వాయు సేన.. ఏంటది?
, బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (11:20 IST)
పాకిస్థాన్ ప్రధాన భూభాగంలోకి వెళ్లి టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేసి వచ్చిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రస్తుతం ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు ఎదుర్కొంటోంది. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ మన దాడిని ప్రతిఘటించే అవకాశాన్ని కూడా ఇవ్వకుండానే బాలాకోట్‌లోని ఉగ్రతండాలను ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 300 మంది వరకు ఉగ్రవాదాలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 
 
ఈ దాడికి ముందు ఒకే సమయంలో 12 మిరేజ్ యుద్ధ విమానాలు టేకాఫ్ అయ్యాయి. ఇవన్నీ ఎందుకు టేకాఫ్ అయ్యాయి.. ఎక్కడకు వెళ్తున్నాయని.. పాకిస్తాన్ సైన్యం గందరగోళానికి గురైందట. అయితే నిమిషాల వ్యవధిలోనే ఇవన్నీ ఒక జట్టుగా కలసిపోయాయి. అనంతరం పాక్ భూభాగంలోకి నేరుగా చొచ్చుకెళ్లి క్షణాల వ్యవధిలోనే పని కానిచ్చేసి, విజయవంతంగా తిరిగొచ్చేశాయి. 
 
అయితే తమ భూభాగంపై భారత్ దాడికి పాల్పడిందని పాకిస్థాన్ గగ్గోలు పెట్టిన ప్రపంచ దేశాలు పట్టించుకోలేదు. ఉగ్రవాదులు హతమార్చేందుకు.. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు పాకిస్థాన్‌ను విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. కానీ పాకిస్థాన్ మాత్రం భారత్‌ను కవ్వించే మాటలు మాట్లాడుతోంది. 
 
ఇకపోతే.. కాగా 1971 యుద్ధం తర్వాత తొలిసారి పాక్ గగనతలంలోకి వెళ్లి మరీ దాడిచేసిన భారత వాయుసేన.. వీటిని మున్ముందు కూడా కొనసాగించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. తాజా దాడి నుంచి ఉగ్రవాదులు తేరుకుని, జవసత్వాలు కూడదీసుకోకముందే మరో దాడి చేసి చావుదెబ్బ కొట్టాలని పథక రచన చేసినట్టు విశ్వసనీయ సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెధవలకు జవాబు చెప్పే సమయం లేదు.. తనీష్‌కి షాకిచ్చిన కౌషల్