Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిలీప్ భుజంపై చెయ్యేసేసరికి గుండె వేగంగా కొట్టుకుంది.. నవ్యా నాయర్

Webdunia
శనివారం, 29 డిశెంబరు 2018 (16:18 IST)
మలయాళ నటి నవ్యనాయర్ తాజాగా వార్తల్లో నిలిచింది. మలయాళంలో ఇష్టం, నందనం వంటి పలు సినిమాలతో పాటు.. తమిళంలోనూ పదికి మించిన సినిమాల్లో నటించిన నవ్యా నాయర్.. 2010లో సంతోష్ మీనన్‌ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు సాయికృష్ణ అనే కుమారుడు వున్నాడు. వివాహానికి తర్వాత సినిమాలకు దూరమైన నవ్య నాయర్.. తిరిగి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది.
 
తాజా ఇంటర్వ్యూలో తన సినిమా అనుభవాలను గురించి తెలిపింది. తన తొలి మలయాళ సినిమా ''ఇష్టం'' అని.. ఈ సినిమా 2001లో విడుదలైంది. ఈ సినిమా దర్శకుడు శిబి తన ఫోటోను చూసి.. హోటల్‌కు రమ్మన్నారు. అక్కడ తన నటనను పరిశోధించి.. వీడియో తీశాడు. ఆ వీడియోను చూసిన మలయాళ నటుడు దిలీప్.. తన యాక్టింగ్‌ బాగుందని చెప్పడంతో ఇష్టం సినిమాలో నటించే అవకాశం వచ్చింది. మంజువారియర్ కూడా తనను ఎంపిక చేశారు. అప్పట్లో మంజువారియర్ వద్దని తనను పక్కనబెట్టి వుంటే సినిమాల్లోకి వచ్చి వుండేదాన్ని కాదు. 
 
ఇష్టం సినిమా కోసం ఫోటో షూట్ జరుగుతుండగా, అప్పుడు తన భుజంపై చెయ్యేసి దిలీప్ ఓ ఫోటో ఫోజిచ్చాడు. ఆ సమయంలో తడబడ్డానని, వణుకు పుట్టిందని.. గ్రామంలో పుట్టిన తాను నగరానికి రావడం.. సినిమాల్లో నటించేందుకు సిద్ధపడటం.. అక్కడ తెలియని వ్యక్తి భుజంపై చెయ్యేసి నిలబడటం చూసి గుండె వేగంగా కొట్టుకుందని నవ్యా నాయర్ తెలిపింది. అయితే ఆ సినిమా యూనిట్‌తో దిలీప్ కూడా భయపడాల్సిన అవసరం లేదని.. ధైర్యంగా వుండాలని చెప్పారని వెల్లడించింది. తాను సినీ ఇండస్ట్రీలోకి దిలీపే ముఖ్య కారణమని.. ఆయన సహకారం ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: చిన్నప్పుడు విన్న కథ తెరపై చూసినప్పుడు నాకు మాటలు రాలేదు : ఎన్టీఆర్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9- ప్రియాశెట్టి అవుట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments