Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితులతో కలిసి భార్యపై అసహజ రీతిలో అత్యాచారం...

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (08:38 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఆమె భర్తే కావడం గమనార్హం. తన స్నేహితులతో కలిసి కట్టుకున్న భార్యపై అసహజరీతిలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై రహస్య భాగాల్లో సిగరెట్లతో కాల్చారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అత్యాచారానికి పాల్పడిన భర్తతో సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌ నగరంలో ఈ దారుణం జరిగింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ ద్వారా ఇండోర్‌కు చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతను చిత్ర హింసలకు గురిచేయసాగాడు. 
 
ఈ క్రమంలో తాజాగా తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడటమేకాకుండా ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. ఈ కామాంధుల నుంచి తప్పించుకున్న బాధితురాలు స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
ఇండోర్‌లోని పిప్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫాంహౌస్‌లో నవంబరు 2019, అక్టోబరు 2021లలో భర్త, అతని స్నేహితులు తనపై అత్యాచారం చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసహజరీతిలో తనపై అత్యాచారం చేశారని, ఆపై సిగరెట్లతో తన ప్రైవేట్ భాగాల్లో కాల్చి చిత్రహింసలకు గురిచేశారని బోరున విలపిస్తూ చెప్పింది. 
 
వారిని ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా, చంపేస్తామని బెదిరించారని వాపోయింది. ఏదో విధంగా అక్కడ నుంచి తప్పించుకుని పుట్టింటికి వెళ్ళినప్పటికీ.. ఒక నిందితుడు మాత్రం తనను అనుసరిస్తూనే చంపేందుకు ప్రయత్నించాడని పేర్కొంది. దీంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments