Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పూజ చేస్తున్న నా భార్యను నరికి చంపేశా: పుత్తూరులో కిరాతక భర్త

Advertiesment
doubt on wife
, శనివారం, 15 జనవరి 2022 (13:28 IST)
సంక్రాంతి పండుగ రోజు ఆ ఇంట్లో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులతో పండుగ చేసుకుని ఎంజాయ్ చేయాల్సిన ఆ కుటుంబంలో అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా చంపేశాడు. అది కూడా పూజ గది నుంచి లాక్కొచ్చి మరీ నరికి చంపాడు.

 
పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా రైతుగా ఉన్న వ్యక్తికి మూడు సంవత్సరాల క్రితమే వివాహమైంది. ఇంకా పిల్లలు లేరు. అయితే భార్యపై గత మూడు నెలల నుంచి భర్తకు అనుమానం ఉంది.

 
నేరుగా భార్యనే అడిగేశాడు. అయితే ఆమె బాధపడింది. ఇద్దరికీ నెల నుంచి ఇదే విషయంపై తరచూ గొడవ జరిగేది. నూతన సంవత్సరం రోజు భార్య ఆత్మహత్యకు ప్రయత్నించింది. చివరకు ఇంటి పక్కన వారు కాపాడారు. 

 
అయితే నిన్న రాత్రి తీవ్రస్థాయిలో ఇదే విషయంపై మరోసారి గొడవ జరిగింది. సంక్రాంతి భోగి పండుగ తెల్లవారుజామున కావడంతో గొడవ పడి ఇద్దరూ నిద్రించారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పూజ గదిలో సామాన్లను శుభ్రం చేసుకుంటున్న భార్యతో మళ్ళీ భర్త గొడవపడ్డాడు.

 
ఇంట్లో పండుగ వద్దు అంటూ గట్టిగా అరిచాడు. వినిపించుకోలేదు భార్య. దీంతో ఆగ్రహంతో ఊగిపోయి ఆమెను పూజ గది నుంచి లాక్కొచ్చి హాలులో పడేశాడు. ఇంట్లో ఉన్న కత్తిని తీసుకుని అతి దారుణంగా ఆమెను నరికాడు. అక్కడికక్కడే వివాహిత చనిపోయింది. కత్తితో రోడ్డుపైకి వచ్చి తన భార్యను చంపేశానని హల్ చల్ చేశాడు భర్త. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి అస్తమయం బాధాకరం