Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కొద్దిరోజులకే కట్నం తేవాలన్నాడు.. భార్య?

Webdunia
సోమవారం, 15 జులై 2019 (20:01 IST)
ప్రేమించి వివాహం చేసుకుని.. భార్యను చిత్ర హింసలకు గురిచేశాడు. చివరికి భర్త వేధింపులు తాళలేక ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ జిల్లాకు చెందిన షోయబ్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన మిస్బా అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు మధ్య కొద్ది రోజుల్లోనే విబేధాలు తలెత్తాయి. ఈ మనస్పర్ధల కారణంగా ప్రేమించి వివాహం చేసుకున్న భార్యను భర్త చిత్ర హింసలకు గురిచేశాడు. 
 
వరకట్నం కోసం వేధించడం మొదలెట్టాడు. దీంతో పుట్టింటికి వెళ్లిపోయిన మిస్బా.. భర్త హింసలను తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు షోయబ్‌‍ను అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో వివాహం చేసుకుని వరకట్నం కోసం వేధింపులకు గురిచేసిన షోయబ్‌ను కఠినంగా శిక్షించాలని మిస్బా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments