Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గాఢంగా ప్రేమిస్తున్నానన్నాడు.. గదికి తీసుకెళ్ళి రెండు రోజులు రేప్...

Advertiesment
man
, శుక్రవారం, 12 జులై 2019 (15:29 IST)
ఒంగోలులో ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన వ్యక్తి బాగోతం బయటపడింది. పోలీస్ ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు జి.కోటిరెడ్డి. ఏడాది కిందట గుంటూరులోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్న అమ్మాయిని చూశాడు. నచ్చింది. ఎలాగైనా ఆమెతో పరిచయం పెంచుకోవాలనుకున్నాడు. మంచి ఉద్యోగం, హై శాలరీ అంటూ కటింగ్స్ ఇస్తూ... మొత్తానికి దగ్గరయ్యాడు. 
 
మొదట ఫ్రెండ్‌షిప్, తర్వాత ప్రేమ అన్నాడు. అతడి మాటలను నమ్మిన ఆ యువతి అతని పరిచయంతో థ్రిల్ అయ్యింది. సినిమాలు, షికార్లకు తీసుకెళ్తుంటే... అదే ప్రపంచం అనుకుంది. ఇలా వన్ ఇయర్ ప్రేమ పేరుతో బాగానే నాటకాలు ఆడాడు. ఇలా ఎన్నాళ్లు... ఇంట్లో వాళ్లకు తెలిస్తే ప్రమాదం. మా వాళ్లైతే అస్సలు ఊరుకోరు. వెంటనే పెళ్లి చేసుకుందాం అంది. దాందేముంది చేసేసుకుందాం అన్నాడు. గుండెల్లో ఏదో భారం దిగిపోయినట్లు ఫీలైంది.
 
ఒంగోలులో ఉండే కోటిరెడ్డి... ఈ నెల 8న గుంటూరులోని ఆమె చదువుతున్న కాలేజీకి వెళ్లాడు. ఇప్పుడే, ఈ క్షణమే పెళ్లి చేసుకుందాం పద అన్నాడు. క్లాస్ రూం నుంచి నేరుగా అతని వెంట వెళ్లిపోయింది.
 
ఒంగోలు... నిర్మల్‌ నగర్‌లోని ఓ గదికి తీసుకుని వెళ్లాడు. మరికొన్ని గంటల్లో మన పెళ్లి అన్నాడు. ఈ గదిలో ఉన్నది మనిద్దరమే... నీకేమనిపిస్తోంది అన్నాడు. ఆమె నోట మాట లేదు. ఆ క్షణం ఆమె దగ్గరకు జరిగాడు. ఇవన్నీ పెళ్లి తర్వాతే అంది. ఇవాళేగా జరిగేది... దానికెందుకు టెన్షన్ పడతావ్... డోంట్ వర్రీ అంటూ... కిటికీ కర్టెన్ మూసేశాడు. అలా రెండురోజులు.
 
రెండ్రోజుల పాటూ ఆమెను రేప్ చేసిన కోటిరెడ్డి... జులై 10న పరిస్థితులు బాగాలేవు. నువ్వు గుంటూరు వెళ్లిపో అన్నాడు. నన్ను పెళ్లి చేసుకో అంది. తర్వాత చూద్దాం అన్నాడు. నన్ను మోసం చేయవద్దు అంది. నాకు ఆసక్తి లేదు అన్నాడు. దుర్మార్గుడా... నా జీవితంతో ఆడుకున్నావ్... అని ఫైర్ అయ్యింది. ఏం చేస్తావో చేసుకో... పెళ్లి చేసుకోను... అంటూ... గదిలోంచి గెంటేశాడు.
 
ఆ యువతి ఒంగోలు పోలీసుల్ని ఆశ్రయించింది. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదుచేశారు. యువతిని ఒంగోలులోని హోంకి తరలించి... పరారీలో ఉన్న కోటిరెడ్డి కోసం గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బైకు మీద కూర్చుంటున్నారా? సీటు కింద పాముందో లేదో చూస్కోండి