బుసకొట్టే పామును చూస్తే.. ఆమడదూరం పరిగెడుతుంటాం. అయితే ఓ యువకుడు పడగెత్తుతూ బైకు సీటుపై కూర్చుని పైపైకి దూసుకొస్తున్న పామును చేతులో సులభంగా పట్టేశాడు. దీంతో అక్కడున్న వారంతా షాకయ్యారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో ఓ షాపు వద్ద నిలబెట్టిన బైకు సీటు కింద నాగుపాము కనిపించింది. సీటు కింద వుండిన పామును ఓ యువకుడు ఇనుప కమ్మీతో బయటికి తెచ్చేందుకు ప్రయత్నించాడు.
అయితే టక్కున లేచి పడగవిప్పిన ఆ నాగుపాము.. సీటుపైకి వచ్చింది. కానీ ఆ యువకుడు ఏమాత్రం భయపడకుండా సునాయాసంగా ఆ పామును పట్టేశాడు. దీన్ని చూసి షాకైన అందరూ చేతిలో వున్న స్మార్ట్ ఫోన్లకు పనిచెప్పారు. వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీరూ ఈ వీడియోను ఓ లుక్కేయండి.