మార్చి 31లోపు అనుసంధానం చేసుకోవాలి.. లేకుంటే రూ.1000 నుంచి రూ.10 వేల వరకు అపరాధం

Webdunia
సోమవారం, 6 మార్చి 2023 (13:47 IST)
ఈ నెలాఖరు లోగా పాన్ కార్డు - ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలని లేనపక్షంలో రూ.1000 నుంచి రూ.10 వేల వరకు అపరాధం చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండు కార్డుల అనుసంధానం కోసం ఈ నెల 31వ తేదీ వరకు డెడ్‌లైన్ విధించిన విషయం తెల్సిందే. ఈ గడువులోగా పాన్ కార్డు, ఆధార్ కార్డు లింకప్ చేయని పక్షంలో పాన్ కార్డు నిరుపయోగంగా మారిపోతుంది. డెడ్‌లైన్ తర్వాత ఈ రెండు కార్డులను అనుసంధానం చేసుకోవాలంటే వెయ్యి రూపాయల నుంచి రూ.10 వేల వరకు అపరాధం చెల్లించి లింకప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ రెండు కార్డుల అనుసంధానం కోసం గడువును పలుమార్లు పొడగించిన విషయం తెల్సిందే. అయితే, ఈ నెలాఖరు తర్వాత ఈ గడువును కేంద్ర ప్రభుత్వం పొడగిస్తుందో లేదో వేచి చూడాల్సివుంది. అనుసంధానం ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు. 
 
ముందుగా వెబ్‌బ్రౌజర్‌లో ట్యాక్స్ ఈ-ఫిల్లింగ్ అధికారిక పోర్టల్ https://www.incometax.gov.in అనే వెబ్‌సైట్లోకి వెళ్లారి. ఆ తర్వాత క్విక్ లింక్ అనే సెక్షన్‌లో లింక్ ఆధార్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. 
 
అలా చేసిన తర్వాత పాన్ నంబరు, ఆధార్ నంబరు, ఆధార్ కార్డులో ఉన్న విధంగా పేరు, మొబైల్ నంబరును ఎంటర్ చేయాలి. ఆ తర్వాత నింబంధనలను అంగీకరిస్తున్నట్టుగా బాక్స్‌లో టిక్ చేయాలి. ఆ తర్వాత కింద ఉండే లింక్ ఆధార్ బటన్‌ను క్లిక్ చేస్తే మీ పాన్ కార్డు, ఆధార్ కార్డులు లింకు అయినట్టుగా ఆధార్ కార్డు‌లోని మొబైల్ నంబరుకు ఓ ఎస్ఎంఎస్ వస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments