Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో ఎస్ఐ ప్రిలిమినరీ ఫలితాలు వెల్లడి... ఎలా చెక్ చేసుకోవాలి?

appolice
, మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (15:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలను తాజాగా వెల్లడించారు. ఈ పరీక్షలను ఈ నెల 19వ తేదీన నిర్వహించగా కేవలం పది రోజుల్లోనే ఫలితాలను ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించడం గమనార్హం. 
 
మొత్తం 411 ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 19వ తేదీన రాత పరీక్షను మొత్తం 291 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షకు 1,51,288 మంది అభ్యర్థులు హాజరుకాగా, 57,923 మంది ఎంపికయ్యారు. వీరిలో పురుషులు 49,386 మంది ఉండగా, 8,537 మంది స్త్రీలు ఉన్నారు. 
 
పరీక్ష నిర్వహించిన మరుసటి రోజే జవాబులకు సంబంధించిన ఆన్సర్ కీని విడుదల చేశారు. దీనిపై పేపర్-1కు దాదాపు 1,553 అభ్యంతరాలు బోర్డుకు అందాయి. వీటిని నిపుణులు పరిశీలించి, ఆన్సర్ కీలో ఎలాంటి మార్పులు చేయలేదని నిర్ధారించింది. 
 
రెండు పేపర్లో అర్హత సాధించిన వారికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 4వ తేదీ ఉదయం నుంచి స్కాన్ చేసిన ఓఎంఆర్ షీటును వెబ్‌సైట్లలో ఉంచుతారు. ఇక ఇతర అప్‌‍డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోవాలని సూచించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుజరాత్‌లో నీచాతి నీచం .. ఏడాదిన్న బాలిక మృతదేహంపై అత్యాచారం..