Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులకు ఇచ్చే దుప్పట్లు నెలకు ఒకసారైనా ఉతుకుతారు : రైల్వే మంత్రి

ఠాగూర్
గురువారం, 28 నవంబరు 2024 (15:34 IST)
రైలు ఏసీ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఇచ్చే దుప్పట్లను నెలకు ఒకసారైనా ఉతుకుతారని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యుడు కుల్దీప్ ఇండోరా అడిగిన ప్రశ్నకు మంత్రి పైవిధంగా సమాధానిమిచ్చారు. భారతీయ రైల్వేలో ఉపయోగించే దుప్పట్లు తేలికగా, సులభంగా ఉతకవచ్చని మంత్రి తెలిపారు. రైళ్లలో ప్రయాణికుల సౌకర్య, భద్రతను నిర్ధారించడానికి తీసుకున్న ఇతర చర్యల గురించి కూడా మంత్రి సభకు తెలిపారు. 
 
రైళ్లలో ప్రయాణించే అనేక మంది ప్రయాణికులకు తరచుగా ఇదే సమస్య ఎదురవుతుంది. ప్రస్తుతం ఇదే అంశంపై పార్లమెంటులో ప్రశ్నించడం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు దీనికి రైల్వే మంత్రి వివరంగా సమాధానం చెప్పడం కూడా అనేక మందిని ఆకర్షించింది. ఈ సమాధానం చూసిన అనేక మంది పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది బెడ్ షీట్లను నెలకు ఒక్కసారైనా ఉతుకుతున్నారని అంటుండగా, మరికొంత మంది మాత్రం నెలకు రెండు సార్లు వాష్ చేయాలని కోరుతున్నారు. ఇంట్లో మాదిరిగా నెలకు ఓసారి ఉతికితే చాలని ఇంకొంత మంది కామెంట్లు చేయడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments