Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లి కుమారుడు కోసం రైలును ఆపేశారు... రైల్వే మంత్రి థ్యాంక్స్ చెప్పిన వరుడి ఫ్యామిలీ

Advertiesment
express rail

ఠాగూర్

, సోమవారం, 18 నవంబరు 2024 (11:35 IST)
సాధారణంగా అత్యవసర సమయాలు లేదా వీఐపీల కోసం కొన్ని నిమిషాల పాటు రైళ్లను నిలిపివేస్తుంటారు. అయితే, ఇక్కడ ఓ పెళ్ళి కుమారుడు కోసం ఓ ఎక్స్‌ప్రెస్ రైలును ఏకంగా మూడు గంటల పాటు నిలిపివేశారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదేశాల మేరకు రైల్వే అధికారులు ఈ సాహసం చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబైకి చెందిన చంద్రశేఖర్ వాఘ్ అనే యువకుడి వివాహం అస్సాంలోని గౌహతికి చెందిన ఓ యువతితో నిశ్చయమైంది. చంద్రశేఖర్ ఈ నెల 14వ తేదీన 34 మంది కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలో బయలుదేరి 15వ తేదీన హౌరా చేరుకుని అక్కడి నుంచి గౌహతి వెళ్లేందుకు రైలు టికెట్లు బుక్ చేసుకున్నారు.
 
అక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. వారు ఎక్కిన గీతాంజలి ఎక్స్‌ప్రెస్ రైలు మూడున్నర గంటలు ఆలస్యమైంది. ఇంత లేటుగా వెళ్తే హౌరాలో వారు ఎక్కాల్సిన సరైఘట్ ఎక్స్‌ప్రెస్‌ను అందుకోలేమని, అదే జరిగితే సమయానికి గౌహతి చేరుకోలేమని భావించిన చంద్రశేఖర్ వెంటనే అత్యవసర సాయం కోసం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, రైల్వేశాఖను ట్యాగ్ చేస్తూ ఎక్స్ పోస్టు పెట్టాడు.
 
చంద్రశేఖర్‌కు కలిగిన అసౌకర్యానికి స్పందించిన రైల్వేశాఖ గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌ వచ్చే వరకు హౌరాలో సరైఘట్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి ఉంచాలని అధికారులను ఆదేశించింది. చంద్రశేఖర్ బృందం హౌరా చేరుకున్నాక సరైఘట్ ఎక్స్‌ప్రెస్ కదిలింది. తన పెళ్లికి సమయానికి చేరుకునేలా సహకరించినందుకు రైల్వేశాఖకు, అధికారులకు చంద్రశేఖర్ థ్యాంక్స్ చెప్పాడు.
 
అయితే, 30 మంది కోసం వందలమందిని వేచి చూసేలా చేసిన రైల్వేపై ప్రయాణికులు, నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక రైలు ఆలస్యమైందని, ఇంకో రైలును ఆన్నేసి గంటలు ఆలస్యంగా నడపడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గీతాంజలి ఎక్స్‌ప్రెస్ విషయంలో సమయపాలన పాటించడంలో విఫలమై, ఈ రకంగా క్రెడిట్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధాని నరేంద్ర మోడీకి నైజీరియా అత్యున్నత పురస్కారం