Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నా... కమలా హరీస్

kamala harris

ఠాగూర్

, గురువారం, 7 నవంబరు 2024 (09:01 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనకు ఎదురైన ఓటమిని అంగీకరిస్తున్నట్టు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్ అన్నారు. వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ విశ్వవిద్యాలయంలో తన ఓటమిని అంగీకరిస్తూ ప్రసంగం చేశారు. 'మేము ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు, ఫలితాలను అంగీకరిస్తాం' అని ఆమె పేర్కొన్నారు. 
 
'ఎన్నికల్లో మేము పోరాడిన తీరు, దాన్ని నడిపిన విధానం గురించి చాలా గర్వపడుతున్నాను. 107 రోజుల ఎన్నికల ప్రచారంలో మేము సమాజాన్ని నిర్మించడం, అతిపెద్ద సంకీర్ణాల నిర్మాణం, ప్రతి రంగం నుంచి ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో విజయవంతం అయ్యాం. అమెరికా భవిష్యత్తు కోసం మా పోరాటం కొనసాగుతుంది' అని కమల పేర్కొన్నారు.
 
'నేను ఈ ఎన్నికలలో ఓటమిని అంగీకరిస్తున్నాను. కానీ, ఈ ఎన్నికల్లో చేసిన పోరాటాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. కొన్నిసార్లు పోరాటానికి కొంత సమయం పడుతుంది. అంతమాత్రానా మనం గెలవలేమని కాదు' అని ఆమె అన్నారు.
 
ఎన్నికల ఫలితాలను అంగీకరించడాన్ని ఉపాధ్యక్షురాలు నొక్కిచెప్పినట్లు జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది. అలాగే అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో తాను మాట్లాదానని, ఆయన విజయానికి అభినందనలు తెలిపానని కమలా హారీస్ చెప్పారు. విజయం సాధించిన ట్రంప్‌నకు అధికార బదిలీని శాంతియుతంగా నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మా.. నేను చదవలేకపోతున్నా... నేను చనిపోతున్నా... ఓ విద్యార్థి ఆత్మహత్య