Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేరా బాబా నా భర్త కాదు.. నాకు తండ్రిలాంటివారు : హనీప్రీత్

డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ తనకు భర్త కాదనీ, తనకు తండ్రిలాంటివారని డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ పేర్కొంది. అత్యాచారం కేసులో డేరా బాబాకు జైలుశిక్ష పడిన తర్వాత హనీప్రీత్ అజ్ఞాతంలోకి వెళ

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (12:15 IST)
డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ తనకు భర్త కాదనీ, తనకు తండ్రిలాంటివారని డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ పేర్కొంది. అత్యాచారం కేసులో డేరా బాబాకు జైలుశిక్ష పడిన తర్వాత హనీప్రీత్ అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా ఆమె కోసం హర్యానా పోలీసులు గాలిస్తున్నారు. అయినప్పటికీ ఆమె ఆచూకీ కనుగొనలేక పోయారు. ఈ నేపథ్యంలో హనీప్రీత్ కోసం హర్యానా పోలీసులు అరెస్టు వారెంట్ జారీ చేశారు. 
 
ఈ నేపథ్యంలో... హనీప్రీత్ ఢిల్లీలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ముందస్తు బెయిల్ దరఖాస్తుపై సంతకం చేసేందుకు సోమవారం హనీప్రీత్ సింగ్ తన కార్యాలయానికి వచ్చినట్టు ఆమె తరపు న్యాయవాది ప్రదీప్ ఆర్య వెల్లడించారు. ఈ ముందస్తు బెయిల్ పిటీషన్‌లో డేరా బాబాతో తనకు వివాహేతర సంబంధం లేదనీ, ఆయన తనకు తండ్రిలాంటివాడనీ హనీప్రీత్ పేర్కొంది. పైగా, డేరా బాబా ఎలాంటి తప్పు చేయలేదనీ, ఈ కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తానని హనీప్రీత్ హామీ ఇచ్చింది. 
 
'డేరాబాబాను దోషిగా నిర్ధారించడం.. తనకు, గుర్మీత్‌కు మధ్య అక్రమ సంబంధాలున్నట్టు ప్రచారం చేయడంపై హనీప్రీత్ సింగ్ తీవ్ర కలతకు గురయ్యారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాల్సిందిగా కోర్టును కోరనున్నాం. ప్రాథమికంగా ఆమెపై దేశద్రోహం కేసు పెట్టారు. ఆమెపై అలాంటి అభియోగాలు మోపడం సరైంది కాదు...' అని ఆమె న్యాయవాది ప్రదీప్ ఆర్య వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గేమ్ ఛేంజర్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఎంత? 186 కోట్లు నిజమేనా? స్పెషల్ స్టోరీ

మోకాళ్ళపై తిరుమల మెట్లెక్కి.. భక్తిని చాటుకున్న నందినిరాయ్ (video)

మొండి గుర్రాన్ని సైతం బాలకృష్ణ కంట్రోల్ చేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు : బాబీ కొల్లి

'గేమ్ ఛేంజర్' నెగటివ్ టాక్, అల్లు అర్జున్ 'పుష్ప కా బాప్' కేక్ కట్

Game Changer: తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.186 కోట్ల కలెక్షన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments