Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎలా అత్యాచారం జరిగిందో బొమ్మ గీసి చూపించింది.. నిందితుడికి ఐదేళ్ల జైలు

తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక ఓ పేపర్‌పై బొమ్మలేసి చూపించి జరిగిన దాన్ని కళ్లకు కట్టినట్లు కోర్టుకు చూపించడంతో.. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని దోషిగా తేల్చింది. అంతేకాకుండా ఐదేళ్ల జైలు శిక్ష వి

ఎలా అత్యాచారం జరిగిందో బొమ్మ గీసి చూపించింది.. నిందితుడికి ఐదేళ్ల జైలు
, బుధవారం, 14 జూన్ 2017 (10:37 IST)
తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక ఓ పేపర్‌పై బొమ్మలేసి చూపించి జరిగిన దాన్ని కళ్లకు కట్టినట్లు కోర్టుకు చూపించడంతో.. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని దోషిగా తేల్చింది. అంతేకాకుండా ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. బసచేసేందుకు నీడ ఇచ్చాననే ధీమాతో ఓ వ్యక్తిపై బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘాతుకానికి సాక్ష్యాధారాలు లేవని సంబరపడుతున్న వేళ.. తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక ఓ పేపర్‌పై బొమ్మలేసి చూపించి జరిగిన దాన్ని కళ్లకు కట్టినట్టు కోర్టుకు చూపించింది. దీంతో నిందితుడికి జైలు శిక్ష తప్పలేదు. 
 
వివరాల్లోకి వెళితే, కోల్‌కతాకు చెందని ఓ బాలిక (10) ఢిల్లీలోని తన మామయ్య అక్తర్ అహ్మద్ ఇంటిలో ఉండి చదువుకుంటోంది. రెండేళ్ల క్రితం అంటే.. బాలిక 8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అక్తర్ ఆ చిన్నారిపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గతేడాది జూన్‌లో అక్తర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిందితుడు తప్పుకునే అవకాశం ఉండటంతో.. బాలిక వద్ద విచారణ చేపట్టారు. 
 
విచారణలో భాగంగా కోర్టులో బాలికకు ఓ పేపర్, క్రేయాన్లు ఇచ్చి  ఏం జరిగిందో బొమ్మ గీసి చూపించమనగా, బాలిక తనపై జరిగిన అత్యాచారం తీరును కళ్లకు కట్టినట్టు బొమ్మ గీసి చూపించింది. దీంతో నిందితుడికి జైలు శిక్ష తప్పలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అగ్నికి ఆహుతైన లండన్‌ గ్రెన్ ఫెల్ టవర్‌: ఒకటే దారి.. వందలాది మంది సజీవదహనం..