Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్‌డౌన్ నుంచి మరికొన్ని మినహాయింపు... కేంద్రం ఉత్తర్వులు

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (09:19 IST)
కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఇది వచ్చే నెల మూడో తేదీవరకు అమల్లోవుండనుంది. అయితే, ఈ నెల 20వ తేదీ నుంచి నాన్ హాట్ స్పాట్ కరోనా ప్రాంతాల్లో పాక్షికంగా లాక్‌డౌన్‌ను సడలించారు. తాజాగా మరికొన్నింటికి లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు ఇచ్చారు. దీనికి సంబంధించి కేంద్ర హోం శాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.
 
ఈ ఉత్తర్వుల మేరకు.. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలలో దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. మున్సిపాలిటీ పట్టణాలలో మాత్రం దుకాణాలు తెరిచేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. అయితే, పట్టణ ప్రాంతాలలో నిత్యావసరాలు కాకుండా ఇతర వస్తువులు అమ్మేందుకు జనావాస ప్రాంతాలలో ఉన్న దుకాణాలను తెరచేందుకు మాత్రం అనుమతి ఇచ్చింది. 
 
కానీ, ఈ దుకాణాలలో 50 శాతం సిబ్బంది మాత్రమే పనిచేయాలని.. సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. ఈ అనుమతులు మద్యం దుకాణాలకు వర్తించబోదని తేల్చి చెప్పింది. అదేవిధంగా, 'హాట్ స్పాట్స్', కంటైన్మెంట్ జోన్స్‌కు కూడా ఈ ఉత్తర్వులు వర్తించవని క్లారిటీ ఇచ్చింది. అయితే, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే.. తమ రాష్ట్రంలో ఎలాంటి మినహాయింపులు లేవని ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments