Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంద్రాగష్టు ఎఫెక్ట్ .. ఉగ్రమూకల హెచ్చరికలు : ఎయిర్‌పోర్టుల్లో భద్రత కట్టుదిట్టం

Webdunia
గురువారం, 8 ఆగస్టు 2019 (15:41 IST)
దేశవ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నారు. అలాగే, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అమలవుతున్న 370 అధికరణను కేంద్రం రద్దు చేసింది. ఈ కారణంగా ఉగ్రమూకలు భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు.
 
మరోవైపు, ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకుంది విమానాశ్రయాల్లో సందర్శకుల అనుమతి రద్దు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం, జమ్ముకాశ్మీర్ విభజన బిల్లు నేపథ్యంలో నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. 
 
ఈ నేపథ్యంలో ఆగస్టు 10 నుంచి 20వ తేదీ వరకు దేశంలోని విమానాశ్రయాల్లో సందర్శకులకు విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి రద్దు చేసింది. 
 
స్వాతంత్ర్య దినోత్సవం, దేశంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సందర్శకులకు అనుమతిపై తాత్కాలిక నిషేధాజ్ఞలు విధించినట్లు తెలిపింది. 
 
విమానాశ్రయాల్లో సందర్శకులకు అనుమతి రద్దును తప్పపనిసరిగా ఆయా ఎయిర్‌పోర్ట్ అధికారులు పాటించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Manisharma: మణిశర్మ ఆవిష్కరించిన వసుదేవ సుతం గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments