Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబై ఉగ్రదాడుల హఫీజ్ సయీద్ విడుదల... పాకిస్తాన్ మేకవన్నె పులి నాటకాలు బట్టబయలు...

ముంబై ఉగ్రదాడుల హఫీజ్ సయీద్ విడుదల... పాకిస్తాన్ మేకవన్నె పులి నాటకాలు బట్టబయలు...
, బుధవారం, 7 ఆగస్టు 2019 (19:04 IST)
ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసులో పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ గుజ్రాన్‌వాలా నగరంలోని కోర్టు బుధవారం ముంబై తీవ్రవాద దాడుల సూత్రధారి, జమత్-ఉద్-దావా (జుడి) చీఫ్ హఫీజ్ సయీద్‌ను దోషిగా ప్రకటించిన నేపధ్యంలో అతడిపై సరైన ఆధారాలు లేవంటూ పాకిస్తాన్ అతడిని విడుదల చేసింది. కశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసిన దరిమిలా అతడిని పాకిస్తాన్ విడుదల చేయడం చూస్తే... పాకిస్తాన్ మేక వన్నె పులి నాటకాలు ఇట్టే తెలిసిపోతున్నాయి. 
 
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అయితే... యుద్ధం రావచ్చునేమో అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరోవైపు దొడ్డిదారిన భారతదేశంలోనికి తీవ్రవాదులను వదిలేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ముంబై దాడుల తీవ్రవాదిని విడుదుల చేయడం చూస్తుంటే ఇది స్పష్టంగా అర్థమవుతోంది.
 
కాగా భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులలో ఒకరైన సయీద్‌ను ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసుకు సంబంధించి జూలై 17న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టు తరువాత, సయీద్‌ను ఏడు రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌లో జైలుకు పంపారు. ఆ తర్వాత జూలై 24న, తీవ్రవాద నిరోధక విభాగం ప్రత్యేక ఉగ్రవాద నిరోధక న్యాయమూర్తి సయ్యద్ అలీ ఇమ్రాన్ తన దర్యాప్తును ముగించి, ఆగస్టు 7న, అంటే ఈ రోజు కోర్టులో అధికారిక చలాన్‌ను సమర్పించాలని కోరారు. ఆ తర్వాత అతడు దోషి అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవంటూ విడుదల చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శాంతి భద్రతలు కొరవడిన గ్రామాల్లో 9న పర్యటన...టీడీపీ