Publish Date: Sun, 04 Aug 2019 (12:19 IST)
Updated Date: Sun, 04 Aug 2019 (12:21 IST)
అమెరికాలో మరోమారు తుపాకీ కాల్పులు జరిగాయి. టెక్సాస్లోని ఎల్పాసో నగరంలో ఉన్న సియలో విస్టా షాపింగ్ మాల్లో ఆగంతకులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.
అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరి కంటే ఎక్కువ మంది ఆగంతకులు కాల్పులకు తెగబడి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
కాల్పుల శబ్దాలకు మాల్లోని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. సాయుధులు పెద్ద ఎత్తున విరుచుకుపడి కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాల్పుల సమయంలో స్థానికులు భయాందోళనతో పరుగెడుతున్న వీడియోను కొందరు ట్విటర్‌లో పోస్ట్ చేశారు.