Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట మునిగిన ఐటి సిటీ బెంగుళూరు - గంటల తరబడి ట్రాఫిక్ జామ్

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (17:13 IST)
భారీ వర్షాలతో కర్నాటక రాష్ట్రం తడిసి ముద్దయిపోతోంది. ఈ వర్షాల దెబ్బకు దేశ ఐటీ రాజధాని బెంగుళూరులోని అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి నగరం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోగా, రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై వాహనాలు ఎక్కడివి అక్కడే బారులు తీరిపోయాయి. ఫలితంగా వాహనచోదకులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని పోయారు. 
 
ముఖ్యంగా నగరంలోని బెళ్లందురు, సర్జాపురా రోడ్డు, వైట్‌ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్డు, బీఈఎంఎల్ లేఔట్ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ వర్షాల ధాటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెంగుళూరు నగరంలో వరుణ దేవుడు విసిరిన జలఖడ్గానికి సంబంధించిన వీడియోలను అనేక మంది నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 
 
వచ్చే నాలుగు రోజుల్లో బీదర్, కలబురగి, విజయపుర, గడగ్, ధార్వాడ్, హవేరి, దావణగెరెలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గత వారం రోజులుగా బెంగుళూరు నగరానికి భారీ వర్షాలు ముంచెత్తున్న విషయం తెల్సిందే. 
 
దీంతో నగరంలోని వేలాది గృహాలు నీట మునిగాయి. వరద నీరు సాఫీగా వెళ్లేందుకు వీలులేక పోవడంతో ఆ నీరంతా లోతట్టు ప్రాంతాల్లోని గృహాల్లోకి చేరిపోతోంది. ఫలితంగా నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments