Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ ప్రియుడిపై యాసిడ్ పోసిన యువతి.. ఎందుకో తెలుసా?

ఠాగూర్
ఆదివారం, 6 అక్టోబరు 2024 (15:44 IST)
తన మాజీ ప్రియుడుపై ఓ యువతి యాసిడ్ పోసింది. బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులకు పాల్పడుతుండటంతో ఈ ఘాతునికి పాల్పడింది. దీంతో మాజీ ప్రియుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆలీగఢ్‌ ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అలీగఢ్‌లోని ఓ రెస్టారెంట్‌కు శనివారం ఉదయే ఓ యువతి వచ్చింది. ఆ తర్వాత కాసేపటికి యువకుడు వచ్చాడు. ఇద్దరూ ఓ టేబుల్ వద్ద కూర్చొని టిఫిన్‌కు ఆర్డర్ చేసి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో యువతి తన హ్యాండ్ బ్యాగులో నుంచి యాసిడ్ బాటిల్ తీసి యువకుడి ముఖంపై చల్లింది. దీంతో తీవ్రగాయాలపాలైన యువకుడు అక్కడ నుంచి పారిపోయాడు. ఆ యువకుడు తన మాజీ ప్రియుడని, తనను బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుండటంతో తట్టుకోలేకే ఇలా చేశానని యువతి చెప్పింది. 
 
తనకు ఇదివరకే వివాహం జరిగిందని, విడాకులు తీసుకున్నానని పోలీసులకు వెవిరించింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అతడికి దగ్గరయ్యానని, అతడి తీరు నచ్చక దూరంగా ఉంటున్నట్టు వెల్లడించింది. అయితే, తాము విడిపోయినా తనను వేధిస్తుండటంతో తట్టుకోలేక ఈ పనికి పాల్పడినట్టు తెలిపింది. కాగా, ఈ దాడిలో యువతికి కూడా యాసిడ్ గాయాలయ్యాయని, పోలీసులు చెప్పారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స చేయించాక అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిస్తామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'పుష్ప-2' త్రీడీ వెర్షన్‌ విడుదలకు ముందు చిక్కులు... ఏంటవి?

అర్థరాత్రి బెన్ఫిట్ షోలు ఎవరి బెన్ఫిట్ కోసం వేస్తున్నారు? : తెలంగాణ హైకోర్టు ప్రశ్న

అల్లు అర్జున్ ఖాతాలో అడ్వాన్స్ బుకింగ్‌లతో కొత్త రికార్డ్

చిరంజీవి లేటెస్ట్ ఫొటో షూట్ - నాని సమర్పణలో శ్రీకాంత్ ఓదెలతో చిత్రం

సమంతకు ఇష్టమైన పనిని చేస్తున్న నాగచైతన్య, ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

తర్వాతి కథనం
Show comments