Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా అన్నందుకు ప్రిన్సిపాల్‌నే చంపేశారు...

తల్లి, తండ్రి.. ఆ తర్వాత స్థానం గురువుదే. కానీ ఓ విద్యార్థి విద్యాబుద్ధులు చెబుతున్న గురువుపై రివాల్వర్‌తో కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్నాడు. 'సరిగా చదవడం లేదు' అని అన్నందుకే ప్రిన్సిపాల్‌ను తుపాకీ

Webdunia
ఆదివారం, 21 జనవరి 2018 (11:08 IST)
తల్లి, తండ్రి.. ఆ తర్వాత స్థానం గురువుదే. కానీ ఓ విద్యార్థి విద్యాబుద్ధులు చెబుతున్న గురువుపై రివాల్వర్‌తో కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్నాడు. 'సరిగా చదవడం లేదు' అని అన్నందుకే ప్రిన్సిపాల్‌ను తుపాకీతో కాల్చి చంపేశారు. తన తండ్రి రివాల్వర్‌తో ఓ విద్యార్థి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హర్యానా రాష్ట్రంలోని యమునానగర్‌లో స్వామి వివేకానంద పాఠశాల ఉంది. దీనికి స్థానికంగా మంచి పేరుంది. ఇక్కడ ఓ 18 యేళ్ల విద్యార్థి కామర్స్ విభాగంలో పన్నెండో తరగతి చదువుతున్నాడు. స్కూల్‌కు సక్రమంగా వెళ్లకపోవడమేకాకుండా సరిగా చదివేవాడు కాదు. పైగా, తోటి విద్యార్థులతో గొడవపడుతూ ఉండేవాడు.
 
దీంతో పాఠశాల ప్రిన్సిపాల్ రీతూచాబ్రా (47) అతడిని మందలించారు. విద్యార్థిలో మార్పురాకపోవడంతో 15 రోజులపాటు సస్పెండ్ చేశారు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న ఆ విద్యార్థి శనివారం పాఠశాలకు వచ్చాడు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయంలో సమావేశ మందిరంలో తల్లిదండ్రులతో మాట్లాడుతున్న రీతూ వద్దకెళ్లి తన వెంట తెచ్చుకున్న 32 బోర్ రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. భుజం, ఛాతి, కడుపులోకి బుల్లెట్లు చొచ్చుకుపోయి ప్రిన్సిపాల్ రీతూ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అక్కడే ఉన్న తల్లిదండ్రులు, స్థానికుల సాయంతో విద్యార్థిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments