Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెప్పినట్టు హెయిర్ కట్ చేయలేదు.. రూ.2 కోట్ల పరిహారం పొందిన మహిళ

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (16:57 IST)
కస్టమర్ చెప్పినట్టుగా హెయిర్ కట్ చేయలేదనీ అందువల్ల ఆమెకు రూ.2 కోట్ల పరిహారం ఇవ్వాలంటూ చెన్నైలోని ప్రముఖ ఐటీసీ నక్షత్ర హోటల్‌ను నేషనల్ కన్జ్యూమర్ డిస్పూట్స్ రీడ్రెస్సల్ కమిషన్ (ఎన్.సి.డి.ఆర్.సి) కోర్టు ఆదేశించింది. ఈ కేసు చెన్నైలో వెలుగు చూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్నైలోని ఐటీసీ నక్షత్ర హోటల్ వుంది. ఇక్కడ 42 యేళ్ల మహిళ హెయిర్ క‌ట్ కోసం 2018 ఏప్రిల్ 18న హోట‌ల్ సెలూన్‌కు వెళ్లారు. తల వెనుక నాలుగు ఇంచ్‌లు క‌ట్ చేయాల‌ని హెయిర్ డ్రెస్స‌ర్‌ను ఆమె కోర‌గా మొత్తం జుట్టు క‌త్తిరించార‌ని ఆమె త‌న ఫిర్యాదులో పేర్కొంది.
 
తాను ధ‌రించిన క‌ళ్ల‌జోడును తీసివేశార‌ని, త‌ల వంచ‌మ‌ని హెయిర్ డ్రెస్స‌ర్ కోర‌డంతో అద్దంలో త‌న‌కేమీ క‌నిపించ‌లేద‌ని, మొత్తం జుట్టును ట్రిమ్ చేసిన త‌ర్వాతే తాను గ‌మ‌నించ‌లేక‌పోయాయ‌న‌ని ఆమె వాపోయారు. 
 
ఆపై త‌ల భాగం నుంచి కేవ‌లం నాలుగు ఇంచ్‌ల హెయిర్‌ను మాత్ర‌మే మిగ‌ల్చ‌డంతో మ‌హిళ కంగుతిన్నారు. ఆపై సెలూన్ త‌న‌కు క్ష‌మాప‌ణ చెప్పినా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన హెయిర్ డ్రెస్స‌ర్‌పై ఎలాంటి చ‌ర్య తీసుకోలేద‌ని ఆమె త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
ఈ విష‌యంపై తాను సెలూన్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌ను సంప్ర‌దించ‌గా అత‌డు త‌న ప‌ట్ల అభ్యంత‌ర‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని ఆమె నేషనల్ కన్జ్యూమర్ డిస్పూట్స్ రీడ్రెస్సల్ కమిషన్ (ఎన్.సి.డి.ఆర్.సి)కి ఫిర్యాదు చేసింది. 
 
దీనిపై విచారణకు జరిపిన కోర్టు.. గ‌తంలో వీఎల్‌సీసీ, ప్యాంటిన్ వంటి బ్రాండ్ల‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా చేసిన ఫిర్యాదుదారు టాప్ మోడ‌ల్ కావాల‌నుకున్నార‌ని, కానీ ఆమె పొడ‌వాటి జుట్టును క‌త్తిరించ‌డంతో ఆమె త‌న క‌ల‌ను నెర‌వేర్చుకోలేక‌పోయార‌ని తన ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.
 
సెలూన్ నిర్ల‌క్ష్యంతో ఆమె తీర‌ని మ‌నోవ్య‌ధ‌కు లోన‌వ‌డ‌మే కాకుండా, ప‌ని ప్ర‌దేశంలో మెరుగైన సామ‌ర్ధ్యం క‌న‌బ‌ర‌చ‌లేక‌పోయింద‌ని తెలిపింది. సెలూన్ నిర్వాకంతో సీనియ‌ర్ మేనేజ్‌మెంట్ ప్రొఫెష‌న‌ల్ ఉద్యోగాన్ని కోల్పోయింద‌ని కోర్టు పేర్కొంది. 
 
ఆమె సూచ‌న‌ల‌కు భిన్నంగా హెయిర్ క‌ట్ చేయ‌డంతో ఫిర్యాదుదారు త‌న అసైన్‌మెంట్ల‌ను కోల్పోయి భారీ న‌ష్టం చ‌విచూడ‌టంతో పాటు టాప్ మోడ‌ల్ కావాల‌న్న ఆమె ఆకాంక్ష నెర‌వేర‌లేద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. 
 
ఆమెను తీవ్ర మాన‌సిక క్షోభ‌కు గురిచేసినందుకు మ‌హిళ‌కు రూ.2 కోట్ల ప‌రిహారం చెల్లించాల‌ని ఐటీసీ మౌర్య‌ను కోర్టు ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాధాభాయ్ సాంగ్ లో మన్నారా చోప్రా మాస్ డ్యాన్స్ మూమెంట్స్

నేడు సినీ పరిశ్రమ తరఫున అభినందనలు మాత్రమే - మరోసారి సమస్యలపై చర్చ

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌తో టాలీవుడ్ నిర్మాతల భేటీ!

పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన అగ్ర నిర్మాతలు - చిన్న నిర్మాతలు అలక

కళ్యాణ్ రామ్‌ యాక్షన్‌ చిత్రంలో విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments