Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించాడు.. నిశ్చితార్థం చేసుకున్నాడు.. పెళ్లి పేరుతో లోబరుచుకుని..?

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (17:11 IST)
ప్రేమించాడు.. నిశ్చితార్థం చేసుకున్నాడు. అనంతరం పెళ్లి చేసుకుంటానని లొంగదీసుకుని లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను పెండ్లి చేసుకోలేనని చెప్పి తనతో సంబంధం తెంచుకోవాలనుకున్నాడు. దీంతో ఆ యువతి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో వెలుగుచూసింది.
 
వివరాల్లోకి వెళితే.. సనంద్‌కు చెందిన యువతికి మొరియ గ్రామంలో ఆటోమొబైల్ ఫ్యాక్టరీలో పనిచేసే యువకుడితో పరిచయం ఏర్పడింది. యువతిని యువకుడు ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఇద్దరికీ నిశ్చితార్ధం జరిగింది. అనంతరం తన కుటుంబంలో వివాదాలు తలెత్తాయని చెప్పి ఆ యువతి ఇంట్లోనే ఆ యువకుడు ఉండేవాడు. 
 
త్వరలో ఇద్దరికీ పెండ్లి జరుగుతుందని ఆమె నమ్మించి ఆమెతో శారీరకంగా లోబరుచుకు న్నాడు. పలుమార్లు లైంగిక దాడి చేశాడు. అనంతరం తన ఇంటికి తిరిగివెళ్లాడు. తర్వాత యువతిని కలిసిన యువకుడు ఆమెను పెండ్లి చేసుకోలేనని తనతో సంబంధం తెంచుకోవాలని చెప్పాడు.
 
యువకుడి తల్లిదండ్రులు సైతం అదే చెప్పారు. పైగా యువతిని ఆత్మహత్య చేసుకోవాలని సూచించారు. దాంతో యువతి విషం తాగి ఆత్మహత్యయత్నానికి ప్పాడగా ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితురాలి స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేసిన పోలీసులు నిందితుడు, అతడి తల్లితండ్రులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం