Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పడగ గదిలో భర్త శవం.. అక్కడే ప్రియుడితో భార్య ఎంజాయ్.. ఎక్కడ?

పడగ గదిలో భర్త శవం.. అక్కడే ప్రియుడితో భార్య ఎంజాయ్.. ఎక్కడ?
, శుక్రవారం, 13 ఆగస్టు 2021 (13:23 IST)
ఓ మహిళ తన ప్రియుడుతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. దీన్ని ఓ రోజున భర్త చూశాడు. అంతే.. అతని అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్ వేసి... తమ పథకం ప్రకారం పడక గదిలోనే భర్తను మట్టుబెట్టింది. ఆ తర్వాత ప్రియుడితో కలిసి ఆ పడక గదిలోనే 12 గంటల పాటు ఎంజాయ్ చేశారు. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో జరిగింది. 
 
ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని సోమ‌మంగ‌ళం గ్రామానికి చెందిన అదెంచెరి, విమ‌లారాణి(37) అనే దంపతులు ఉన్నారు. అయితే, విమలకు అదే ప్రాంతానికి చెందిన ఓ యువ‌కుడితో ఏర్పడిన పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. 
 
ఈ విష‌యం భ‌ర్త‌కు తెలియ‌డంతో ఆమెను ప‌లుమార్లు మంద‌లించాడు. అయిన‌ప్ప‌టికీ ఆమెలో మార్పు రాలేదు. ఈ క్ర‌మంలో కొద్ది రోజుల క్రితం దంప‌తుల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. ఈ గొడ‌వ‌ల నేప‌థ్యంలో భ‌ర్త‌ను చంపాల‌ని భార్య నిర్ణ‌యించుకుంది. దీంతో జులై 28న రాత్రి త‌న ప్రియుడును పడక గదికి పిలిపించింది. కొద్దిసేపు ఏకాంతంగా గడిపారు. ఇంతలో భర్త ఇంటికి వచ్చి పడక గదిలో భార్య చేస్తున్న పాడుపనిని చూశాడు. 
 
ఆ తర్వాత ఆమెను కొట్టేందుకు పడకగదిలోకి వెళ్లగా, తన ప్రియుడితో కలిసి భర్తను విమలా రాణి చంపేసింది. భ‌ర్త‌ను చంపిన త‌ర్వాత అత‌ని మృత‌దేహం అక్క‌డే ఉంచి.. రాణి, ఆమె ప్రియుడు బెడ్‌రూమ్‌లోనే 12 గంట‌ల పాటు గ‌డిపారు. ఆ త‌ర్వాత డెడ్‌బాడీని చెంగ‌ల్‌ప‌ట్టు తీసుకెళ్లి నిప్పంటించిన‌ట్లు రాణి తెలిపింది. ఈ కేసులో విమలా రాణిని పోలీసులు అరెస్టు చేయగా, పరారీలో ఉన్న ప్రియుడి కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైనర్ కూతుర్ని అత్యాచారం చేసిన తండ్రి.. పదేళ్ల జైలు శిక్ష