Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్‌లో రభస : 10 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు

Webdunia
బుధవారం, 28 జులై 2021 (16:44 IST)
పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు రభస సృష్టిస్తూనే వున్నారు. దీంతో వర్షాకాల సమావేశాలు రసాభాసగా మారాయి. పట్టుమని పది నిమిషాలు కూడా సభా కార్యక్రమాలు సజావుగా సాగలేదు. విపక్ష పార్టీలు పదేపదే సభా కార్యక్రమాలకు అడ్డు తగలుగుతున్నారు. దీన్ని సభాపతి ఓం బిర్లా సీరియస్‌గా తీసుకున్నారు. 
 
దేశాన్ని కుదిపేస్తున్న పెగాస‌స్ స్పైవేర్ అంశంతో పాటు వివాదాస్పద సాగు చట్టాల రద్దు వంటి అంశాల‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని విపక్షాలు పట్టుడుతున్నాయి. కానీ, స్పీకర్ మాత్రం ఏమాత్రం స్పదించడం లేదు. చర్చకు ఆహ్వానించడం లేదు. దీంతో కొందరు ఎంపీలు పోడియం వద్దకు దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలోనే ఓ ద‌శ‌లో కొంద‌రు విప‌క్ష ఎంపీలు చైర్‌పైకి పేప‌ర్లు విసిరేశారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల స్పీక‌ర్ ఓం బిర్లా సీరియ‌స్‌గా ఉన్నారు. ప‌ది మంది ఎంపీల‌పై ఆయ‌న వేటు వేశారు. స‌స్పెన్ష‌న్‌కు గురైన ఎంపీల్లో మానికం ఠాగూర్‌, డీన్ కురియ‌కోజ్‌, హిబ్బి హిడ‌న్‌, జోయిమ‌ని, ర‌వ‌నీత్ బిట్టు, గుర్జీత్ ఔజ్లా, ప్ర‌తాప‌న్‌, వైద్యలింగం, స‌ప్త‌గిరి శంక‌ర్‌, ఏఎం ఆరిఫ్‌, దీప‌క్ బైజ్‌లు ఉన్నారు. 
 
చైర్ ప‌ట్ల అవ‌మాన‌క‌రంగా ప్ర‌వ‌ర్తించినందుకు రూల్ 374(2) ప్ర‌కారం 10 మంది ఎంపీల‌కు స‌స్పెండ్ నోటీసులు జారీచేశారు. ఒక‌వేళ ఎవరైనా స‌భ్యులు భ‌విష్య‌త్తులో ఇలాగే ప్ర‌వ‌ర్తిస్తే, వారిని లోక్‌స‌భ ట‌ర్మ్ మొత్తం బ‌హిష్క‌రించ‌నున్న‌ట్లు స్పీక‌ర్ బిర్లా గట్టిగా హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments