Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ భార్యను చంపేసి.. ఖాతాను అప్‌డేట్ చేసిన వైద్యుడు...

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (10:59 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వైద్యుడు అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. మాజీ రెండో భార్యను చంపేసి.. ఆమె జీవించివున్నట్టుగా పోలీసులను నమ్మించేందుకు ఆమె ఫేస్‌బుక్ ఖాతాను ఏడు నెలల పాటు అప్‌డేట్ చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
యూపీలోని గోరఖ్‌పూర్ ప్రాంతానికి చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ ధర్మేంద్ర ప్రతాప్ సింగ్. స్థానికంగా ఓ ఆస్పత్రిని నిర్వహిస్తున్నాడు. ఈయన మహిళా డాక్టర్ రాఖీ రాజేశ్వరి సింగ్‌ తండ్రి హరేరామ్ శ్రీవాస్తవకు 2006లో తన ఆస్పత్రిలో ఆపరేషన్ చేశాడు. ఆ సమయంలో డాక్టర్ ధర్మేంద్రకు, డాక్టర్ రాఖీలకు మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఈ క్రమంలో తనకు పెళ్లి అయిందన్న విషయాన్ని మరిచిపోయిన ధర్మేంద్ర.. రాఖీని రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో వేరే ప్రాంతంలో కాపురం పెట్టాడు. ఇందుకోసం ఓ ఇంటిని కూడా కొనుగోలు చేశాడు. ఈ విషయం ధర్మేంద్ర మొదటి భార్య ఉషా సింగ్‌కు తెలిసింది. అప్పటినుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. 
 
రెండో భార్య రాఖీని వదిలివేయాలంటూ ధర్మేంద్ర మొదటి భార్య ఉషాసింగ్ ఒత్తిడి చేయసాగింది. ఈ విషయం తెలుసుకున్న రాఖీ కాస్తా డాక్టరును వదిలి మనీష్ అనే మరో యువకుడిని ప్రేమించి పెళ్లాడింది. అనంతరం మొదటి భర్త డాక్టర్ ధర్మేంద్ర నుంచి తన కోసం కొన్న ఇల్లును తన పేరిట బదిలీ చేయాలని రాఖీ డిమాండ్ చేయసాగింది. ఇందుకు ధర్మేంద్ర నిరాకరించాడు. 
 
ఈ క్రమంలో ధర్మేంద్ర నేపాల్‌కు వెళ్లిపోయాడు. తన మొదటి భర్త నేపాల్‌లోని పోఖ్రాలో ఉన్నాడని తెలుసుకున్న రాఖీ.. అతన్ని కలిసేందుకు అక్కడికి వెళ్లింది. ఇల్లు తన పేరిట బదిలీ చేయమని ఒత్తిడి తెచ్చింది. దీంతో తన అనుచరులైన ప్రమోద్ కుమార్, దేశ్ దీపక్‌లతో కలిసి రాఖీని కొండపై నుంచి కిందకు తోసి హత్య చేయించాడు. 
 
ఈ హత్యను దాచిపెట్టేందుకు డాక్టరు ఆమె ఫోన్ సాయంతో గౌహతి నుంచి ఆమె పేరిట ఉన్న సోషల్ మీడియాను ఏడు నెలలపాటు అప్ డేట్ చేయించాడు. ఈ కేసులో పోలీసులు తొలుత రాఖీ భర్త మనీష్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అతనికి ఈ హత్యతో ప్రమేయం లేదని తేలింది. 
 
అనంతరం డాక్టరు ఫోన్ నంబరు సాయంతో అతను రాఖీతో మాట్లాడాడని తేలింది. దీంతో డాక్టర్ సింగ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే రాఖీ హత్యా ఉదంతం వెలుగుచూసింది. దీంతో డాక్టరు ధర్మేంద్రతోపాటు.. హత్యకు సహకరించిన ప్రమోద్ కుమార్, దేశ్ దీపక్‌లను పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments