Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక శనివారాల్లోనూ అమెరికా వీసాలకు ఇంటర్వ్యూలు...

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (08:57 IST)
తమ దేశ వీసా కోసం నెలల తరబడి నిరీక్షించే వారికి అగ్రరాజ్యం శుభవార్త చెప్పింది. ఇక నుంచి శనివారాల్లోనూ వీసాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపింది. ఇందులోభాగంగా, వీసా దరఖాస్తుల కోసం శనివారాల్లో ప్రత్యేక స్లాట్లు కేటాయించనున్నారు. ఇందుకోసం అమెరికా నుంచి భారత్‌కు మరింత మంది దౌత్య అధికారులను కూడా పంపించనుంది. 
 
ఇందులోభాగంగా, ఇప్పటికే ఈ నెల 21వ తేదీన ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. వీసా ఇంటర్వ్యూలకు హాజరచ్యే వారి కోసం ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్ నగరాల్లోని అమెరికన్ రాయబార కార్యాలయాల్లో ప్రత్యేకంగా కార్యకలాపాలు నిర్వహించారు. 
 
వచ్చే నెలలోనూ ఎంపిక చేసిన శనివారాల్లో వీసా దరఖాస్తుల కోసం అదనపు స్లాట్లను అందుబాటులో ఉంచనున్నారు. వీసా కోసం నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తున్న నేపథ్యంలో దౌత్య కార్యాలయాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. 
 
అలాగే, వీసాలా జారీ ప్రక్రియ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు వీలుగా జనవరి - మార్చి మధ్య వాషింగ్టన్, ఇతర ఎంబీసల నుంచి పదుల సంఖ్యలో అధికారులు భారత్‌కు రానున్నారు. ఈ వేసవి కల్లా భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాల్లో అదనపు సిబ్బంది సాయంతో వీసాల జారీ ప్రక్రియ కరోనా ముందునాటి పరిస్థితికి చేరుకుంటుందని అమెరికా అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments