ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. వచ్చే బడ్జెట్‌లో వేతనాలను పెంచే అవకాశథం వున్నట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్ అనంతరం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచే యోచనలో ప్రభుత్వం వున్నట్లు సమాచారం. అదే జరిగితే ఉద్యోగుల వేతనాల్లో భారీగా మార్పులు జరుగనున్నాయి.
ఈ నెల 31న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న 2.57 శాతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.68 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.
ఇందుకు సంబంధించిన ముసాయిదాను కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. కేంద్రం కూడా 3శాతం వరకు పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ.18వేల నుంచి రూ.26 వేలకు పెరిగే అవకాశం వుంటుంది.