Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

23న డిప్లమో ఇన్ పార్మసీ సీట్ల కేటాయింపు: చదలవాడ నాగరాణి

jobs
, శుక్రవారం, 13 జనవరి 2023 (23:14 IST)
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌లు, ఫార్మసీ సంస్థలలో డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్సుల ప్రవేశాల షేడ్యూలును సాంకేతిక విద్యాశాఖ సంచాలకురాలు, ప్రవేశాల కన్వీనర్ చదలవాడ నాగరాణి విడుదల చేసారు. షెడ్యూల్‌ను అనుసరించి ఈ నెల 18, 19 తేదీలలో ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజును చెల్లించవలసి ఉండగా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ 19, 20 తేదీలలో ఉంటుంది.


కళాశాలల ఎంపికను 19 నుండి 21వ తేదీ లోపు పూర్తి చేసుకోవాలని, 23వ తేదీన సీట్ల కేటాయింపు జరగనుండగా, 24వ తేదీ నుండి విద్యార్ధులు తరగతులకు హాజరు కావలసి ఉంటుందని చదలవాడ వివరించారు. విద్యార్ధులకు పూర్తి సమాచారం అందుబాటులో ఉండేలా సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆప్షన్ల ఎంపికకు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్, షెడ్యూల్, పొందుపరచవలసిన పత్రాల వివరాలను apdpharm.nic.in వెబ్‌సైట్‌లో  ఉంచామన్నారు. అభ్యర్థులు వెరిఫికేషన్ కోసం అవసరమైన సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.

 
రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి జారీ చేసిన డిఫార్మశీ-2022 ర్యాంక్ కార్డ్, ఇంటర్మీడియట్ మార్కు లిస్టు, ఎస్ ఎస్ సి లేదా దానికి సమానమైన మార్కుల మెమో, ఆరు నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్లు, ఫీజు రీ ఎంబర్స్ నిమిత్తం అర్హత కలిగిన వారు తెలుపు రేషన్ కార్డు, 2019 జనవరి ఒకటి తరువాత జారీ చేయబడిన అదాయ దృవీకరణ పత్రం, రిజర్వేషన్ కు అర్హత కలిగిన వారు కుల దృవీకరణ పత్రం సిద్దంగా ఉంచుకోవాలని నాగరాణి స్పష్టం చేసారు. దివ్యాంగులు, సాయిధ దళాల సిబ్బంది, క్రీడా కోటాకు అర్హులు, మైనారీటీలు వారి అవసరాలకు అనుగుణంగా ధృవీకరణ పత్రాలు సిద్దంగా ఉంచుకోవాలని స్పష్టం చేసారు.

 
అవసరమైన బదిలీ ధృవీకరణ, వర్తిస్తే ఇడబ్ల్యుఎస్ ధృవీకరణ ఉండాలన్నారు. దివ్యాంగ, ఎన్ సిసి, క్రీడా కోటాకు అర్హులైన ప్రత్యేక కేటగిరీల వారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం 19వ తేదీన విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు, ఇతర అభ్యర్థులు 19, 20 తేదీలలో విజయవాడతో సహా విశాఖపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్, కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ లలోని హెల్ప్ లైన్ సెంటర్‌లలో ఉదయం 9గంటలకు  సిద్దంగా ఉండాలన్నారు. 1వ ర్యాంకు నుండి చివరి ర్యాంక్ వరకు అందరికీ ఇదే వర్తిస్తుందని సాంకేతిక విద్యాశాఖ సంచాలకురాలు, ప్రవేశాల కన్వీనర్ చదలవాడ నాగరాణి వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశపు అతిపెద్ద స్టూడెంట్‌ చాంఫియన్‌షిప్‌ విజేతలను వెల్లడించిన లీడ్‌