Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కైలాశగిరిని తిరువణ్ణామలైగా మార్చేస్తాం... ఏడడుగుల శివ విగ్రహం..?

Lord Shiva
, శుక్రవారం, 13 జనవరి 2023 (20:04 IST)
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పక్కన కైలాశగిరి కొండకు వెళ్లే దారిలో అంజూరు మండపం సమీపంలో రామాపురం రిజర్వాయర్ ఉంది. తీరం వెంబడి తామరపువ్వులు వికసిస్తున్నాయి. భక్తులను ఈ ప్రాంతం బాగా ఆకర్షిస్తుంది. 
 
ఈ పరిస్థితిలో శ్రీకాళహస్తి తదుపరి ఎం.ఎం. వాడా ప్రాంతానికి చెందిన మత్తయ్య అనే భక్తుడు అంజూరు మండపాన్ని పునరుద్ధరించి ప్రభుత్వ అనుమతితో రామాపురం చెరువులో శివపార్వతుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ శివుడి విగ్రహం 7 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు ఉంటుంది. విగ్రహాల ప్రతిష్ఠాపన పనులు శరవేగంగా సాగుతున్నాయి. 
 
శివుడి విగ్రహ ప్రతిష్ఠాపన పనులు కళాత్మకంగా సాగుతున్నాయని మత్తయ్య అన్నారు. శివుడి తలపై నుంచి పడే గంగాజలాన్ని పోలి ఉండేలా కృత్రిమ ఫౌంటెన్‌ను ఏర్పాటు చేయనున్నారు. శ్రీకాళహస్తి శివాలయానికి దర్శనం కోసం వచ్చే భక్తులు ఈ జలాశయానికి వచ్చి శివ విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. 
 
భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా శివ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. శివుడి విగ్రహం చుట్టూ కళ్లకు కట్టేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయనున్నారు. మ్యూజికల్ ఫౌంటెన్ ఏర్పాటు చేస్తారు.  కైలాసగిరిని తమిళనాడు తిరువణ్ణామలైలా అభివృద్ధి చేస్తామని.. ఇందుకోసం ప్రభుత్వ అనుమతిని తీసుకుంటామని చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్.. ముంబై స్ట్రీట్ ఫుడ్ టేస్ట్.. Sandwich and Chilli Ice Cream