Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మున్ముందు తాహసీల్దారులకు కూడా సలహాదారులు నియమిస్తారేమో? : హైకోర్టు

Advertiesment
High Court
, శుక్రవారం, 6 జనవరి 2023 (09:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా నియమిస్తున్న ప్రభుత్వ సలహాదారులపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో కలెక్టర్లకు, పోలీస్ కమిషనర్లకు, తాహశీల్దార్లకు సైతం సలహాదారులను నియమించుకునే ప్రభావం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. సలహాదారుల నియామకానికి అంతు ఎక్కడుందని మండిపడింది. 
 
ముఖ్యమంత్రి, మత్రులకు సలహాదారులను నియమిస్తే అర్థం చేసుకోగలం గానీ, ప్రభుత్వ శాఖలకు సలహాదారులు ఏంటి అని వింతగా ప్రశ్నించింది. సలదారుల నియామకానికి రాజ్యాంగబద్ధత ఉందా లేదా అనే విషయాన్ని తేలుస్తామని స్పష్టం చేస్తూ, ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. 
 
జ్వాలాపురపు శ్రీకాంత్‌ను దేవాదాయ శాఖ సలదారునిగా నియమించడాన్ని సవాల్ చేస్తూ ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధికార ప్రతినిధి రాజశేఖర్ రావు గత యేడాది ఆగస్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం సలదారుల రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. తాజాగా ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారణకు రాగా, ఈ సలదారుల నియామకానికి రాజ్యాంగబద్ధత ఉందో లేదో తేలుస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబును చూస్తే వైకాపా నేతలకు లాగులు తడిపిపోతున్నాయ్.. : రామ్మోహన్ నాయుడు