Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ రాష్ట్రంలో ఎక్స్ బీబీ 1.5 వేరియంట్

Advertiesment
xbb variant
, శుక్రవారం, 6 జనవరి 2023 (08:40 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కొత్త వేరియింట్ వెలుగు చూసింది. ఇప్పటికే అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలను వణికించిన ఈ వైరస్ ఇపుడు భారత్‌లోకి కూడా ప్రవేశించింది. తాజాగా కరోనా కొత్త వేరియంట్ అయిన ఎక్స్ బీబీ1.5ను తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో వైద్యులు గుర్తించారు. 
 
అగ్రరాజ్యం అమెరికాలో గత కొన్ని రోజులుగా ఈ తరహా వేరియంట్‌కు చెందిన వైరస్ సోకుతున్న వారి సంఖ్య అధికంగా ఉన్న విషంయం తెల్సిందే. ఇపుడు ఈ ఎక్స్ బీబీ 1.5 మన దేశంలోకి ప్రవేశించినట్టు ఐఎన్‌ఎస్ఏసీఓజీ వెల్లడించింది. 
 
కేంద్ర వైద్య శాఖ నివేదికల ప్రకారం ప్రస్తుతం గుజరాత్‌లో మూడు, తెలంగాణ, కర్నాటక, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఈ కేసులు నమోదయ్యాయి. ఎక్స్ బీబీ వేరియంట్ ఒమిక్రాన్ బీఏ 2.10.1, బీఏ 2.75 సబ్ వేరియంట్‌ల రీకాంబినెంట్. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో వెలుగుచూసిన కేసుతో పాటు ఇప్పటివరకు దేశంలో మొత్తం ఏడు కేసులను గుర్తించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేటి నుంచి ఏపీలో సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో రాయితీలు..