ప్రేమించిన వ్యక్తికి కళ్ల ముందే పెళ్లి.. ప్రియురాలు ఏం చేసిందంటే?

Webdunia
సోమవారం, 12 జులై 2021 (17:41 IST)
ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్లు దూరం అయితే కలిగే బాధ నరకం కంటే దారుణంగా ఉంటుంది. కారణాలేమైనా ప్రాణం అనుకున్న వాళ్లు మన కళ్ల ముందే వేరే వారితో జీవితాన్ని పంచుకునేందుకు సిద్ధపడితే కలిగే వేదన అంతా ఇంతా కాదు. అలాంటి హృదయవిదారక వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ప్రేమించిన వ్యక్తి మరో అమ్మాయిని వివాహం చేసుకుంటుండగా పెళ్లి మండపం వద్ద ప్రియురాలు గుండెలు పగిలేలా రోదించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని హోసంగాబాద్‌లో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. కాన్పూర్‌కు చెందిన ఓ యువతి ఉద్యోగ నిమిత్తం భోపాల్‌లో ఉంటోంది. ఈమె పనిచేసే సంస్థలోనే ఉద్యోగం చేసే ఓ వ్యక్తితో గత మూడేళ్ల నుంచి సహజీవనం చేస్తోంది.

అయితే ఇటీవల అతనికి తల్లిదండ్రులు వేరే మహిళతో రహస్యంగా పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రేయసి పెళ్లి జరుగుతున్న వేడుక వద్దకు వెళ్లింది. లోపలికి వెళ్లేందుకు యువతి ప్రయత్నించగా.. సెక్యూరిటీ గార్డులు అడ్డుకున్నారు.
 
దీంతో ఆమె మండపం బయట నుంచే 'బాబు..బాబు' అంటూ గుండెలు పగిలేలా రోదించింది. మండపం నుంచి బయటకు రావాల్సిందిగా కేకలు చేసింది. తనతో ఒక్కసారి మాట్లాడాలని వేడుకుంది. కాగా యువతి హల్‌చల్ చేస్తుండడం పోలీసుల దృష్టికి వెళ్లింది.

దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఆమెను వివరాలు అడగడంతో.. ప్రస్తుతం పెళ్లి చేసుకుంటున్న వరుడు తన ప్రేమికుడని, తనతో కలిసి మూడేళ్లు సహజీవనం చేసి, ఇప్పుడు రహస్యంగా పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పింది.

అతడిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలపగా.. ఇంట్లో వాళ్లకు ఇబ్బందులు వస్తాయని సదరు యువతి కంప్లైంట్ ఇవ్వలేదని సమాచారం. వెంటనే తనతోపాటు వచ్చిన వారితో కలిసి భోపాల్ వెళ్లిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments