Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సుధీర్‌బాబు హీరోగా ర‌చ‌యిత హ‌ర్ష వ‌ర్ధ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా

సుధీర్‌బాబు హీరోగా ర‌చ‌యిత హ‌ర్ష వ‌ర్ధ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా
, సోమవారం, 12 జులై 2021 (13:51 IST)
Sudhir Babu
హీరో సుధీర్ బాబుతో `అమృతం` సీరియ‌ల్ ఫేమ్ ర‌చ‌యిత‌, న‌టుడు హర్ష వర్ధన్ దర్శ‌కునిగా మారాబోతున్నాడు. ఈ చిత్రాన్ని సోమ‌వారంనాడు అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. సోనాలి నారంగ్, శ్రిష్టి స‌మ‌ర్ప‌ణ‌లో ఒక డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ తెర‌కెక్క‌నుంది.
 
ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. ఆయ‌న హీరోగా  శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి (ఎ యూనిట్ ఆఫ్ ఏషియన్ గ్రూప్)లో ప్రొడక్షన్ నెంబర్ 5 చిత్రానికి సైన్ చేశారు. నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్‌ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
 
శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యాన‌ర్‌లో నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన ల‌వ్‌స్టోరీ చిత్రం విడుద‌ల‌కి సిద్దంగా ఉంది. దీంతో పాటు ధ‌నుష్‌, శేఖ‌ర్ క‌మ్ముల చిత్రంతో పాటు మ‌రికొన్ని ఎగ్జ‌యిటింగ్ ప్రాజెక్ట్స్ పైప్‌లైన్‌లో ఉన్నాయి. మీడియం, హై బ‌డ్జెట్ ల‌తో వ‌రుస‌గా విభిన్న త‌ర‌హా చిత్రాల‌ను ప్రక‌టిస్తూ త‌మ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటోంది శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి సంస్థ‌. ఈ చిత్రం షూటింగ్‌ ఆగ‌స్ట్ నుండి ప్రారంభంకానుంది. ఇత‌ర వివ‌రాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పీరియాడిక్ 'స్కైలాబ్‌' లుక్‌ విడుదల చేసిన తమన్నా