Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

పీరియాడిక్ 'స్కైలాబ్‌' లుక్‌ విడుదల చేసిన తమన్నా

Advertiesment
Satyadev
, సోమవారం, 12 జులై 2021 (13:25 IST)
Skylab look
స‌త్య‌దేవ్‌, నిత్యామీనన్, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా డా.రవి కిరణ్‌ సమర్పణలో బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామీనన్‌ కంపెనీ పతాకాలపై విశ్వ‌క్ కందెరావ్‌ దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తోన్న చిత్రం 'స్కైలాబ్‌'. 1979 లో సాగే పీరియాడిక్ మూవీ ఇది. ఆదివారం ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను మిల్కీబ్యూటీ తమన్నా విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ గమనిస్తే.. అందులో స్కైలాబ్ పై సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణతో పాటు మరికొందరు కూర్చుని ఉన్నారు. వీరి చుట్టూ డబ్బులు ఎగురుతున్నాయి. 
 
 అమెరికా స్పేస్ స్టేష‌న్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేష‌న్ స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ప్రపంచమంతా అసలేం జరగబోతుందోనని ఊపిరి బిగపట్టి ఎదురుచూడసాగారు. ప్రపంచంలోని అన్నీ న్యూస్‌ చానెల్స్‌, వార్తాపత్రికలు ఈ వార్తను ప్రముఖంగా కవర్‌ చేశాయి. అలాంటి నేపథ్యంలో మన తెలుగు రాష్ట్ర్రంలో బండ లింగపల్లి అనే గ్రామంలో  ఉండే గౌరి, ఆనంద్‌, రామారావుల జీవితాల్లో స్కైలాబ్‌ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలను ఎంటర్‌టైనింగ్‌గా చూపిస్తూ 'స్కైలాబ్‌' సినిమాను రూపొందిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను తెలియజేస్తామని చిత్రయూనిట్ తెలియజేసింది. 
 
న‌టీన‌టులు: నిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌, రాహుల్ రామ‌కృష్ణ, తనికెళ్ల భరణి, తులసి, విష్ణు, అనుష త‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు: మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  విశ్వ‌క్ కందెరావ్‌, నిర్మాత: పృథ్వీ పిన్నమరాజు, సహ నిర్మాత: నిత్యామీనన్‌, సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది, ఎడిటర్‌:  రవితేజ గిరిజాల, మ్యూజిక్‌: ప్ర‌శాంత్‌ ఆర్‌.విహారి, సౌండ్ రికార్డిస్ట్‌‌:  నాగార్జున త‌ల్ల‌ప‌ల్లి, సౌండ్‌ డిజైన్‌: ధ‌నుష్ న‌య‌నార్‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతే రాజు, రైతే వెన్నెముక - ఇది చెప్పుకోవ‌డానికేనా! నిల‌దీస్తున్న రైత‌న్న‌