Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైతే రాజు, రైతే వెన్నెముక - ఇది చెప్పుకోవ‌డానికేనా! నిల‌దీస్తున్న రైత‌న్న‌

రైతే రాజు, రైతే వెన్నెముక - ఇది చెప్పుకోవ‌డానికేనా! నిల‌దీస్తున్న రైత‌న్న‌
, సోమవారం, 12 జులై 2021 (13:10 IST)
Raitanna pressmeet
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన చిత్రం రైతన్న..ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది త్వరలో రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా రైతు నాయకులు ఈ సినిమాను ప్రసాద్ క్యాబ్ లో వీక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రి శ్వరారావు, కాంగ్రెస్ పార్టీ లీడర్ కోదండ రెడ్డి, సీ పి ఐ నాయకులు చాడా వెంకట్ రెడ్డి సి పీ ఎం నాయకులు మధు,  టి ఆర్ ఎస్ నాయకులు శ్రీనివాసరెడ్డి, ప్రజాకవి గద్దర్, ఎం ఎల్ సి గోరటి వెంకన్న, కవి అందే శ్రీ, రైతు నాయకులు వెంకట రామయ్య, మల్లారెడ్డి , గోవర్ధన్ , రైతు సంఘం సాగర్,  శ్రీమతి పద్మ, 
తదితరులు పాల్గొన్నారు
 
ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ; సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి త్వరలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాను. ఈ సినిమాలో ఎస్పీ బాల సుబ్రమణ్యం, వంగపండు ప్రసాద్రావు పాటలు పాడారు. వారికి నా నివాళులు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలను వెంటనే రద్దు చెయ్యాలి అని రైతన్న సినిమా తీశాను.ఈ చిత్రం ద్వారా చెప్పే విషయం ఏమిటంటే నేటి రైతు పరిస్థితి గురించి. భారత దేశంలో సామాజికంగా వెనకబడిన కులం ఏదైనా వుంది అంటే అది రైతు కుటుంబమే. రైతు పరిస్థితి ఏమిటి?. రైతే దేశానికి వెన్నుముక.రైతే రాజు, ఆ నానుడి ఏమైంది. ఆ రైతు ఎక్కడున్నాడు. అన్నం పెట్టే అన్నదాత ఏ పొజిషన్ లో వున్నాడు ఈరోజు చాలా బాధాకరంగా వుంది  రైతు పరిస్థితి. ఎందుకంటే రైతు తను పండించే పంటకి మార్కెట్లో గిట్టు బాటు ధర రాక తన అప్పులు తీర్చుకో లేక అనేక ఇబ్బందులు పడుతున్న రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కొస్తున్నాడు. అలా రాకూడదు రైతు ఆత్మ హత్య చేసుకోకూడదు. అన్నం పెట్టే  రైతుకి గిట్టుబాటు ధర కావాలి. డాక్టర్ స్వామి నాథన్ కమిటీ సిఫార్స్ లను ఇంప్లిమెంట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం వాటికి చట్ట బద్దత కలిపించిన నాడు రైతే రాజు.రైతే దేశానికి వెన్నుముక.అప్పుడు రైతు వృద్ధి లోకి వస్తాడు. వ్యవసాయం దండుగ కాదు పండుగనే రోజు రావాలని అన్నం పెట్టే అన్నదాత సుఖ సంతోషంతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను తీసిన చిత్రమే ఈ రైతన్న అని అన్నారు
 
మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావు మాట్లాడుతూ; ఈ రోజు రైతులు ఎదుర్కంటున్న కష్టాలు, వారి భాధలు అలాగే ఇప్పుడు మోడీ గవర్నమెంట్ తెచ్చిన రైతు చట్టాలు రైతులకు ఎలాంటి కష్టాలు తెస్తాయో కళ్ళకు కట్టినట్లు చూపించారు ఈ రైతన్ను సినిమాలో ఆర్ నారాయణ మూర్తి. స్వామినాథన్ కమిషన్ నివేదిక ను అమలు పరచాలి. కేరళ ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ చట్టలను అమలు పరుస్తోంది. మోడీ ప్రభుత్వం రాజ్యంగ ప్రకారం బిల్లు ను తీసుకురాలేదు. ఈ బిల్లు పై విచారణ జరగాలి. విద్యుత్ బిల్లు అధాని ఆఫీస్ లో తయ్యారయ్యింది .భారత రైతాంగం ఏడు నెలల నుంచి ఈ వ్యవసాయ విద్యుత్ చట్టాల పై పోరాడుతుంది. ఎంతో ధైర్యం చేసి ఈ సినిమాను నారాయణ మూర్తి తీసినందుకు ఆయనకు ధన్యవాదములు చెపుతున్నాను
 
ప్రజాకవి గద్దర్ మాట్లాడుతూ, తత్వ వేత్తలు ప్రపంచం గురించి భాష్యం చెప్పారు. వాటిని నేను తప్పు పట్టను. ఈ రైతన్న సినిమా నీ పౌర సమాజం లోకి తీసుకొని వెళ్ళాలి సొంత ఆశా లేని వాడు ఆర్ నారాయణ మూర్తి. ఇల్లు లేదు, భార్య లేదు, అలు లేదు శులు లేదు, తను నమ్మిన సిద్ధాంతం కోసం రక్తాన్ని చిందించే వ్యక్తి ఆర్ నారాయణ మూర్తి . ఈ సినిమా కార్పొరేట్ రంగాలకు క్వాచన్ పేపర్ లాంటిది.  ఈ సినిమాలో రైతుల బాధల గురించి క్లియర్ గా చెప్పాడు. కమిట్ మెంట్ వున్న వ్యక్తి ఆర్ నారాయణ మూర్తి.. వ్యవసాయం దండుగ కాదు వ్యవసాయం పండుగ. ఆ పండుగలో పాల్గొంటాము అని చెపుతున్నాను  గౌరవ ప్రధాని గారు మీరు తెచ్చిన వ్యవసాయ విద్యుత్ చట్టాలు రద్దు చేయండి.. అందరికీ అప్పీల్ చేస్తున్న పెద్దవాళ్ళు అందరూ ఆలోచన చేయండి.అని చెపుతున్నాను రైతాంగం తప్పకుండా గెలుస్తుంది అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వామ్మో... అఖిల్ ఏంటి ఇలా మారిపోయాడు...