Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హీరోల పిల్ల‌ల‌తో దిల్‌రాజు సినిమా!

హీరోల పిల్ల‌ల‌తో దిల్‌రాజు సినిమా!
, శనివారం, 10 జులై 2021 (16:17 IST)
Ayan-Arha
సినిమారంగంలోని హీరోలు, ఇత‌ర సెల‌బ్రిటీ పిల్ల‌ల‌తో దిల్‌రాజు ఓ బాల రామాయ‌ణం త‌ర‌హా సినిమా బోతున్నాడ‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే మ‌హేస్‌బాబు కూతురు, వంశీపైడి ప‌ల్లి కుమార్తెలు కూడా బాల‌ల‌కు సంబంధించిన టిప్స్‌ను త‌మ స్వంత యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా పాపుల‌ర్ అయ్యారు. ఇలా కొంత‌మంది పిల్ల‌లు వున్నారు. ఇక అల్లు అర్జున్ కుమాడు, కుమార్తె అయాన్‌, అర్హా కూడా చిన్న చిన్న స్కిట్‌లు చేసి య్యూ ట్యూబ్‌లో పెడుతున్నారు. అభిమానులు తెగ వైర‌ల్ చేస్తున్నారు. అందుకే అలాంటి వారితో ఓ సినిమా చేస్తే ఎలా వుంటుంద‌నే థాట్ దిల్‌రాజుకు వ‌చ్చింద‌ని తెలుస్తోంది.
 
విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ప్రముఖ నిర్మాత దిల్ రాజు అల్లు అర్జున్ కుమార్తె అర్హా ప్రధాన పాత్రలో ఓ బాలల చిత్రం నిర్మించబోతున్న‌ట్లు వార్త వినిపిస్తుంది. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. ఇంత‌కుముందు ఎం.ఎస్‌.రెడ్డిగారు కూడా బాల రామాయ‌ణం తీశారు. దాని ద్వారా ఎన్‌.టి.ఆర్‌. వెలుగులోకి వ‌చ్చాడు. ఇక దిల్‌రాజు నిర్మించ‌బోయే బాల‌ల చిత్రంలో దిల్ రాజు మ‌న‌వుడు అర్హ‌ణ్ కూడా క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. చూద్దాం భిన్న‌మైన సినిమాలు నిర్మించే దిల్‌రాజు ఈ సినిమాతో మ‌రింత పేరు తెచ్చుకుంటాడేమో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిర్యానీతో ఎఫ్‌3 టీమ్‌కు విందు చేసిన అలీ